Pawan Kalyan : సితార బ్యానర్ కు తలనొప్పిగా మారిన పవన్ కళ్యాణ్

Update: 2025-04-16 07:00 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కు మంచి రిలేషన్స్ ఉన్నాయి. హారిక హాసినికి త్రివిక్రమ్ ఫిక్స్ అయిపోవడం.. పవన్, త్రివిక్రమ్ బాండింగ్ బలమైనది కావడం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదే సితార బ్యానర్ కు చిక్కులు తెస్తోంది. ప్రతిసారీ పవన్ వల్ల వాళ్లే ఇబ్బంది పడుతున్నారు. అంటే వ్యక్తిగతంగా కాదు. సినిమాల పరంగా. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రాన్ని మార్చి 27న విడుదల చేయాలనుకున్నారు. ఆ టైమ్ కు మ్యాడ్ స్క్వేర్ తో ఉన్నారు వాళ్లు. ఒకవేళ పవన్ వస్తే తమ సినిమాను వాయిదా వేసుకుంటాం అని చెప్పాడు నాగవంశీ. హరిహర పోస్ట్ పోన్ అయింది. ఈ సారి మే 9కి అన్నారు. ఆ డేట్ లో సితార బ్యానర్ లో రూపొందుతోన్న మాస్ జాతర చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ఈ మూవీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ మధ్యే వచ్చిన ఫస్ట్ లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. హరిహర వస్తుందని మాస్ జాతరను జూలైకి వాయిదా వేస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది.

అయితే తాజాగా హరిహర వీరమల్లు మే 9 నుంచి కూడా పోస్ట్ పోన్ అవుతోందనే టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి ఇంకా చాలా వర్క్ చేయాల్సి ఉందట. పవన్ పై కొన్ని షాట్స్ కూడా షూట్ చేయాలట. పోస్ట్ ప్రొడక్షన్ కూడా కొంత మిగిలిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ కారణంగా మూవీని మే 30న విడుదల చేయాలనుకుంటున్నారు. విశేషం ఏంటంటే ఆ డేట్ కు సితార బ్యానర్ లోనే రూపొందుతోన్న విజయ్ దేవరకొండ మూవీ కింగ్ డమ్ ను రిలీజ్ చేస్తున్నారు. పవన్ వస్తే కింగ్ డమ్ పోస్ట్ పోన్ కావడం ఖాయం అనుకోవచ్చు.

నిజానికి ఈ చిక్కంతా ఓ రకంగా పవన్ కళ్యాణ్ వల్లే అంటున్నారు. ఆయన సరైన టైమ్ కు డేట్స్ ఇచ్చి పూర్తి చేస్తే ఈ గొడవే ఉండేది కాదు. కానీ పవన్ ఇచ్చిన డేట్స్ ను నిర్మాతలు వాడుకోలేదనే టాకూ ఉంది. అలా ఉన్నా.. సినిమా ఇండస్ట్రీలో ఇవి కామన్ కదా. ఆ విషయం తెలియనివాడేం కాదు పవన్. అందుకే వీలైనంత త్వరగా ఆ చిత్రాన్ని పూర్తి చేస్తే ఎవరికీ ఏ ఇష్యూస్ ఉండవు. 

Tags:    

Similar News