Pawan kalyan : పంచకట్టు, భుజం పై గొంగళి, చేతిలో కర్ర.. పవన్ లుక్ లీక్..!
Pawan kalyan : టాలీవుడ్‌లో లీకుల బెడద ఎక్కువైంది.. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి ఏదో రూపంలో సినిమాకు సంబంధించిన చిత్రాలు, పాటలు బయటికి వస్తున్నాయి.;
Pawan kalyan : టాలీవుడ్‌లో లీకుల బెడద ఎక్కువైంది.. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి ఏదో రూపంలో సినిమాకు సంబంధించిన చిత్రాలు, పాటలు బయటికి వస్తున్నాయి. ఈ మధ్యే మహేష్ బాబు సర్కారు వారి పాట నుంచి ఫస్ట్ సాంగ్ లీకైంది.. తాజాగా పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ మూవీ నుంచి ఓ ఫోటో లీకైంది.
భీమ్లానాయక్ సినిమా కోసం ఓ ప్రమోషనల్ సాంగ్ చివరి రోజు షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో పవన్ లుక్ లీకైంది. ఇందులో పవన్.. పంచ కట్టు, గొంగళితో, చేతిలో కర్ర పట్టుకొని అచ్చం పల్లెటూరు గెటప్‌లో ఉన్నారు. పవన్ ఇలాంటి లుక్‌లో కనిపించడం ఇదే మొదటిసారి కావడంతో పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ ఫోటోని చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.
సోషల్ మీడియాలో ఈ లుక్ వైరల్‌గా మారడంతో సినిమాపైన మరిన్ని అంచనాలు పెరిగాయి. కాగా ఇందులో పవన్ పొలీస్ పాత్రలో నటిస్తుండగా రానా మరో హీరోగా నటిస్తున్నాడు.. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, మాటలు త్రివిక్రమ్ అందించారు.
సితార ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మలయాళ సూపర్ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' కి ఇది రీమేక్ కాగా, భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ఈ నెల(ఫిబ్రవరి) 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.