Bheemla Nayak : వా..! భీమ్లానాయక్‌లో పవన్ వాట్ ఏ ఎంట్రీ.. : ఉమైర్ సంధు
Bheemla Nayak : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతాగానో ఎదురుచూస్తోన్న మూవీ భీమ్లానాయక్.. ఇప్పటికే రిలీజైన పాటలు, పోస్టర్స్ సినిమా పైన భారీ అంచనాలను పెంచేశాయి..;
Bheemla Nayak : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతాగానో ఎదురుచూస్తోన్న మూవీ భీమ్లానాయక్.. ఇప్పటికే రిలీజైన పాటలు, పోస్టర్స్ సినిమా పైన భారీ అంచనాలను పెంచేశాయి.. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఫిబ్రవరి 25 న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈరోజు సాయంత్రం(ఫిబ్రవరి 17న) భీమ్లానాయక్ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని దర్శకుడు సాగర్ కె చంద్ర సెట్స్ నుంచి అధికారికంగా ప్రకటించారు.
అయితే ఈ సినిమా గురించి పవన్ కళ్యాణ్ అభిమానులకి మంచి కిక్కిచ్చే న్యూస్ చెప్పాడు ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు.. రాబోయే సినిమాలకి సంబంధించిన రివ్యూలను ట్విట్టర్ వేదికగా పంచుకోవడంలో ఉమైర్ సంధు ఎప్పుడు ముందే ఉంటాడు.
ఈ క్రమంలో సెన్సార్ బోర్డ్‌లో భీమ్లానాయక్ మూవీని చూసిన ఉమైర్ సంధు... సినిమాలో పవన్ ఎంట్రీ గూస్బంప్స్ అంటూ పోస్ట్ పెట్టాడు.. అతని స్టైల్ ఎవరికీ రాదని, అందుకే అతను పవర్ స్టార్ అయ్యడంటూ ఉమైర్ సంధు తన పోస్ట్ లో చెప్పుకొచ్చాడు. అటు రానా ఎంట్రీ కూడా అదిరిందని పేర్కొన్నాడు.
#PawanKalyan ! Woohooooo !
— Umair Sandhu (@UmairSandu) February 17, 2022
What an Entry in #BheemlaNayak ! Goosebumps 🔥🔥🔥🔥
Nobody has a SWAG like him ! That's why he is a Power STAR ❤
ఉమైర్ సంధు ట్వీట్‌తో సినిమా పైన అంచనాలు మరింతగా పెరిగాయి. కాగా మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్‌కి రీమేక్‌గా భీమ్లానాయక్ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. తమన్ సంగీతం సమకూర్చాడు.