O.G Censor Report : ఓజి సెన్సార్ రిపోర్ట్.. పిల్లలకు నో ఎంట్రీ

Update: 2025-09-22 13:09 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ.జి మూవీ సెన్సార్ పూర్తయింది. సుజీత్ డైరెక్షన్ లో రూపొందిన ఈ చిత్రానికి సెన్సార్ నుంచి ‘ఏ’ సర్టిఫికెట్ వచ్చింది. అంటే ఓన్లీ పెద్దలకు మాత్రమే అన్నమాట. ఏ సర్టిఫికెట్ వచ్చిందంటే 18 యేళ్ల లోపు వారికి నో ఎంట్రీ అని సెన్సార్ రూల్. బట్ పవన్ కళ్యాణ్ సినిమాకు ఈ రూల్స్ ఎవరు పట్టించుకుంటారు. దూసుకుపోతారంతే. మామూలుగా టీజర్ తర్వాత వచ్చిన పాటలు, తాజాగా వచ్చిన ట్రైలర్ చూస్తే ఓ.జిలో వయొలెన్స్ భారీగా ఉంటుందని అర్థం అయింది. ఓ రకంగా బ్లడ్ షెడ్ కనిపించబోతోంది. పవన్ గత సినిమాలకు భిన్నంగా వెండితెరపై రక్తపాతం సృష్టించబోతును్నాడు అని తేలిపోయింది. పైగా ఆయన కోసమే ప్రత్యేకంగా ఓ ఖడ్గాన్ని క్రియేట్ చేశాడు దర్శకుడు. ఆ ఖడ్గం తోనే విలన్స్ ను వేటాడతాడు అన్నమాట.

మొత్తంగా ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలకు ఏ సర్టిఫికెట్ గురించి పెద్దగా ఆలోచించడం లేదు. ఆ కంటెంట్ ను అలాగే ఆడియన్స కు చూపించేందుకు ఇష్టపడుతున్నారు మేకర్స్. ఈ మూవీ విషయంలోనూ అదే జరిగింది. ఏ సర్టిఫికెట్ వచ్చినా తమ కంటెంట్ కట్ కావొద్దు అనే భావిస్తున్నారు దర్శకులు. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ మూవీకి సైతం వాళ్లు ఏ సర్టిఫికెట్ అంటే ఎస్ చెప్పేశారు. ఇక సినిమా నిడివి 2 గంటల 34 నిమిషాలు ఉంది.

Tags:    

Similar News