Payal Rohatgi: 'అందుకోసం చేతబడి చేశాను'.. బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు..

Payal Rohatgi: 15 ఏళ్లుగా తాను ఇండస్ట్రీలో ఉన్నానని తన కెరీర్ గురించి ముందుగా చెప్పుకొచ్చింది పాయల్.

Update: 2022-03-29 03:50 GMT

Payal Rohatgi: బిగ్ బాస్ తరహాలోనే హిందీలో మొదలైన మరో కాంట్రవర్షియల్ షో 'లాకప్'. ఇది కూడా కాస్త బిగ్ బాస్ కాన్సెప్ట్‌లాగానే ఉన్నా.. ఇందులో కంటెస్టెంట్స్ పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా బయటపడుతుంది. పైగా షో రూల్స్ ప్రకారం ఒక కంటెస్టెంట్ ఎలిమినేషన్ నుండి తప్పించుకోవాలంటే వారి జీవితంలోని అతిపెద్ద సీక్రెట్‌ను బయటపెట్టాలి. తాజాగా ఓ నటి బయటపెట్టిన నిజంతో హౌస్‌మేట్స్‌తో సహా ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు.

హైదరాబాద్‌లో పుట్టి పెరిగినా కూడా తనకంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ స్థానాన్ని సంపాదించుకుంది పాయల్‌ రోహత్గి. హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో చిత్రాల్లో మెరిసింది పాయల్. అంతే కాకుండా 2001లో మిస్ వరల్డ్ టూరిజమ్ కిరీటాన్ని కూడా దక్కించుకుంది. 2012 తర్వాత సినిమాలను వదిలేసి బుల్లితెరపైకి వచ్చేసిన పాయల్.. తాజాగా 'లాకప్'లోకి కంటెస్టెంట్‌గా ఎంటర్ అయ్యింది. లాకప్ ఎలిమినేషన్ నుండి తప్పించుకోవడానికి తను ఓ సంచలన నిజాన్ని బయటపెట్టింది,

15 ఏళ్లుగా తాను ఇండస్ట్రీలో ఉన్నానని తన కెరీర్ గురించి ముందుగా చెప్పుకొచ్చింది పాయల్. ఒకానొక సమయంలో తన కెరీర్ డల్ అయిపోయిందని, అది పుంజుకోవడానికి చేతబడి చేశానని బయటపెట్టింది పాయల్. దీనికి ఢిల్లీలోని ఓ పూజారి సాయం చేశాడని తెలిపింది. కానీ దాని వల్ల ఏ ప్రయోజనం కలగేదని చెప్పింది పాయల్. చేతబడి గురించి ఎవరికైనా చెప్తే తనను చులకనగా చూస్తారని ఇప్పటివరకు దాచిపెట్టానని స్పష్టం చేసింది.

పాయల్ చెప్పిన విషయాన్ని విని షాక్ అయ్యారు కంటెస్టెంట్స్. కానీ నటి కంగనా రనౌత్ మాత్రం బిగ్గరగా నవ్వేసింది. పాయల్‌కు టాలెంట్ ఉందని, అలాంటప్పుడు ఈ మంత్రతంత్రాలు అవసరం లేదని చెప్పింది కంగనా. తాను కూడా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చేతబడి చేసిందని ఆరోపించాని తెలిపింది. అయితే ఈ విషయం విని తన బాయ్‌ఫ్రెండ్ ఎలా స్పందిస్తాడో అని పాయల్‌ను అడిగింది కంగనా. అయితే అతడు ఏది నమ్మాలనుకుంటున్నాడో అతడికే వదిలేస్తానని, అతడిపై మాత్రం చేతబడి చేయలేదని జోక్ చేసింది పాయల్.

Tags:    

Similar News