Kubera : కుబేరను పట్టించుకోని కోలీవుడ్

Update: 2025-06-19 08:00 GMT

మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా కుబేర. ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో ధనుష్ ను మెయిన్ హీరోగా ఎస్టాబ్లిష్ చేశాడు శేఖర్. ప్రమోషన్స్ పరంగా చూస్తే తెలుగు కంటే తమిళ్ లో ఎక్కువగా చేశారు. ధనుష్ కు తమిళ్ లో తిరుగులేని క్రేజ్ ఉంది. ఇటు నాగార్జున సైతం కూలీ మూవీతో అక్కడ ట్రెండింగ్ లో ఉన్నాడు. రష్మిక నేషనల్ క్రష్ గా అక్కడా బాగా తెలుసు. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నా.. ఎందుకో కుబేరను తమిళ్ ఆడియన్స్ లైట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ చాలా అంటే చాలా పూర్ గా కనిపిస్తున్నాయక్కడ. బహుశా దర్శకుడు గురించి పెద్దగా తెలియకపోవడం కారణం అనుకోవడానికి లేదు. తమిళ్ వాళ్ల సినిమాలను మనం ఎగబడి చూసినట్టు వాళ్లు తెలుగు సినిమాలను చూడరు. ఆ మాటకొస్తే తెలుగు సినిమాపై వారికి పెద్దగా ఒపీనియన్ కూడా కనిపించదు అనేది చాలాసార్లు తేలిపోయింది. మన టాప్ హీరోల సినిమాలకు కూడా అక్కడ ఏమంత పెద్ద ఓపెనింగ్స్ రావు. అదే వాళ్ల టాప్ హీరోలైతే మనోళ్లు విరగబడి చూస్తారు.

బిలియనీర్ వర్సెస్ బెగ్గర్ అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందించానని చెప్పాడు శేఖర్ కమ్ముల. తన సినిమాల్లో కెల్లా ఇదే ది బెస్ట్ అని కూడా ప్రామిస్ చేస్తూ చాలా కాన్ఫిడెంట్ గా ప్రమోషన్స్ లో చెబుతున్నాడు. ఇది తనకు తల్లి లాంటి సినిమా అని కూడా చెప్పాడు. శేఖర్ కమ్ముల కెరీర్ లో ఓ సినిమా గురించి ఎప్పుడూ ఇంతలా గొప్పగా చెప్పుకోలేదు. అలాంటిది కుబేర గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు. అయితే ఈ మూవీతో తమిళ్ ఆడియన్స్ కు తనేంటో చూపించాలనుకున్నాడు. అందుకే అక్కడే ఎక్కువ ప్రమోషన్స్ చేశాడు. అయినా ఓపెనింగ్స్ చూస్తే బిలో యావరేజ్ గా కనిపిస్తున్నాయి. కనీసం ధనుష్ క్రేజ్ కూడా పనిచేయడం లేదు. అంటే తెలుగు వారి సినిమాలకు తమిళ్ వారు ఇచ్చే ప్రాధాన్యత ఎలా ఉంటుందో దీన్ని బట్టి మరోసారి అర్థం చేసుకోవచ్చు. 

Tags:    

Similar News