అల్లు అర్జున్ ని ఆస్కార్ వరిస్తుంది: పోసాని
ప్రతిష్టాత్మక జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న అల్లు అర్జున్‌ను ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి అభినందించారు.;
ప్రతిష్టాత్మక జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న అల్లు అర్జున్‌ను ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి అభినందించారు.
"RRR," "కొండపొలం", "ఉప్పెన" మరియు "పుష్ప" సహా జాతీయ స్థాయిలో తెలుగు చిత్రాలకు గుర్తింపు లభించడం పట్ల కూడా ఆయన హర్షం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్‌కి ప్రశంసలు అందించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును కూడా అల్లు అర్జున్ గెలుచుకుంటాడని తన ఆశాభావం వ్యక్తం చేశాడు.
పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ “అల్లు అర్జున్‌కి కూడా ఆస్కార్ అవార్డు వస్తుంది. అల్లు అర్జున్ అంటే నాకు చాలా అభిమానం. స్టార్ హీరో అయినప్పటికీ నిత్య విద్యార్థిలా నేర్చుకునే లక్షణాలు అతడి సొంతం. ఇది విశేషమైన లక్షణం. ఇంతకు ముందు తెలుగు హీరోలు ఎవరూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకోలేదు. అల్లు అర్జున్ తన ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తే, భవిష్యత్తులో ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు అతడిని వరిస్తుంది అని పోసాని అన్నారు.
ఎప్పుడూ రాజకీయ వివాదాల్లో ఇరుక్కునే పోసాని, సినిమాల గురించి మాట్లాడడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది అందరినీ. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప: ది రూల్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.