Pradeep Machiraju : ప్రదీప్ కొత్త సినిమా.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి

Update: 2024-10-17 15:00 GMT

తెలుగు స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే సినిమాతో హీరోగా మారిన విషయం తెలిసిందే. మ్యూజికల్ గా మెప్పించిన ఈ సినిమా కమర్షియల్ గా మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తరువాత మళ్ళీ యాంకరింగ్ వైపే వెళ్లిన ప్రదీప్ తాజాగా తన కొత్త సినిమాను ప్రకటించాడు. 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' టైటిల్ తో వస్తున్న ఈ సినిమాకు సంబందించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై ఆడియన్స్ లో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. నితిన్-భరత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మరో యాంకర్ దీపికా పిల్లి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు అర్జున్ రెడ్డి ఫేమ్ రధాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.

Tags:    

Similar News