Prakashraj lost in Maa Elections 2021: మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ఓటమికి ప్రధాన కారణాలు ఏంటంటే..

Prakashraj lost in Maa Elections 2021: నేను మోనార్క్ ని. నేను ఎవరి మాటా వినను. ఇది ప్రకాశ్ రాజ్ ఫేమస్ డైలాగ్.

Update: 2021-10-10 16:15 GMT

prakash raj (tv5news.in)

Prakashraj lost in Maa Elections 2021: నేను మోనార్క్ ని. నేను ఎవరి మాటా వినను. ఇది ప్రకాశ్ రాజ్ ఫేమస్ డైలాగ్. కానీ ఈసారి మాత్రం మా ఎన్నికల్లో ఆయన అందరి మాటలూ విన్నారు. తన సహజ స్వభావానికి విరుద్ధంగా చాలా జాగ్రత్తగానే ప్రచారం చేశారు. మంచు విష్ణుపై మొదట్లో ఘాటు విమర్శలు చేసినా తరువాత మాత్రం చాలా కేర్ ఫుల్ గా మాట్లాడారు. అయినా సరే విజయం సాధ్యం కాలేదు.

ప్రకాశ్ రాజ్ తో పాటు ఆయన ప్యానల్ సభ్యులంతా మంచు శిబిరం నుంచి వచ్చే దాడిని ఎదుర్కోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు కానీ సరైన వ్యూహంతో క్యాంపైన్ లో ముందుండలేకపోయారు. దీంతో ప్రచార పర్వంలో మంచు విష్ణు ప్యానల్ దే పైచేయి అయ్యింది. పైగా మీడియాలో చర్చలు, సోషల్ మీడియాలో డిస్కషన్స్ అంతా హాట్ హాట్ గా ఉండేలా మంచు శిబిరం జాగ్రత్తలు తీసుకుంది.

మంచు విష్ణు సీనియర్ ఓటర్లను స్వయంగా కలిసి వారి ఆశీస్సులను తీసుకున్నారు. అప్పుడే మంచు ప్లానింగ్ ను ప్రకాశ్ రాజ్ ప్యానల్ పసిగట్టి ఉంటే.. దానికి అనుగుణంగా పావులు కదిపి ఉండేవారు. కానీ అటువైపు నుంచి అంతే దూకుడుగా మాట్లాడేవారు తక్కువగా ఉన్నారు. కేవలం ప్రకాశ్ రాజ్, జీవితా రాజశేఖర్ లు మాత్రమే దూకుడుగా మాట్లాడారు. అయినా అది అంతగా ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.

మంచు విష్ణుపై ప్రకాశ్ రాజ్ వేసిన సెటైర్ లు కూడా అంతగా పేలలేదు. దీంతో వాటిలో కొన్ని విష్ణుకే ఫేవర్ గా మారాయన్నది టాలీవుడ్ టాక్. మొత్తానికి వ్యూహాలన్నీ మంచు విష్ణుకే కలిసిరావడంతో మా అధ్యక్ష పీఠంతో పాటు చాలా పోస్టులు వారికే దక్కాయి. ఇది ఆ శిబిరంలో ఆనందోత్సాహాలను పెంచింది.

Tags:    

Similar News