చాలా తక్కువ టైమ్ లో ప్యాన్ ఇండియా డైరెక్టర్ గా తిరుగులేని క్రేజ్, మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు ప్రశాంత్ నీల్. అందుకే ఇప్పుడు సౌత్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయ్యాడు. టాప్ హీరోస్ అంతా అతనితో సినిమాలు చేయాలనుకుంటున్నారు. అతని రైటింగ్, మేకింగ్ ఇండియన్ సినిమాకు కొత్తగా కనిపించాయి. అందుకే అంత క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా మాస్ ఎలిమెంట్స్, హీరో ఎలివేషన్స్ లో ప్రశాంత్ నీల్ ఓ కొత్త స్ట్రాటజీని క్రియేట్ చేశాడు అనే చెప్పాలి. కేజీఎఫ్ రెండు భాగాలు, సలార్ తో సత్తా చాటిన అతను ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని 2026 జూన్ 25న విడుదల చేయబోతున్నారు.
ఇక ఈ మూవీకి భారీ రెమ్యూనరేషనే అందుకుంటున్నాడు ప్రశాంత్ నీల్. అయినా మరో కొత్త డిమాండ్ నిర్మాతల ముందుకు ఉంచాడట. సినిమా లాభాల్లో తనకూ వాటా కావాలన్నదే ఆ డిమాండ్. అంటే రెమ్యూనరేషన్ కాకుండానే ఈ వాటా అన్నమాట. అయితే ఇది పది, ఇరవై శాతం కాదు. ఏకంగా 50శాతం వాటా కావాలన్నాడట. ఆశ్చర్యంగా అతని డిమాండ్ కు నిర్మాతలు ఒకే చెప్పారు. మామూలుగా రెమ్యూనరేషన్ కాకుండా ఇలా వాటాలు, ఏరియాల రైట్స్ అడుగుతుంటారు. కానీ మనోడు పారితోషికంతో పాటు సగం వాటా అంటున్నాడంటే ఈ సినిమాపై అతని నమ్మకం చాలా గట్టిగానే ఉందనుకోవాలి.