Prithi Mukundan : ప్రభాస్ కు ఫిదా అయిపోయా.. కన్నప్ప బ్యూటీ

Update: 2025-07-15 08:45 GMT

‘ఓం భీమ్ బుష్'తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ప్రీతి ముకుందన్. మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం 'కన్నప్ప'తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ భామ నటిస్తున్న రొమాంటిక్ కామెడీ చిత్రం 'మైనే ప్యార్ కియా' ఆగస్టు 29న విడుదల కానుంది. ఇక.. ‘కన్నప్ప'లో రెబెల్స్టార్ ప్రభాస్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడంపై ప్రీతి తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. 'కన్నప్ప లాంటి భారీ ప్రాజెక్ట్ అనుకోకుండా చాన్స్ వచ్చింది. కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండా ఇలాంటి పెద్ద సినిమాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. సవాలుగా ఉండే పాత్రలంటే నాకు ఇష్టం. అవి కష్టంగా ఉన్నప్పటికీ గుర్తింపు తెస్తాయి. అలాంటి క్యారెక్టర్స్ ఉంటే ఆడిషన్ ఇవ్వడానికి సిద్ధమే. కన్నప్పలో ప్రభాస్తో కలిసి నటించడం ఒక మెమోరబుల్ ఎక్స్ పీరియన్స్. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ పాజిటివిటీ ఉంటుంది. ప్రభాస్ ప్రత్యేకత స్క్రీన్ పై కూడా స్పష్టంగా కనిపించింది. నిజ జీవితంలోనూ ఆయన చాలా స్వీట్ పర్సన్. పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ ఎంతో సరదాగా, మర్యాదగా ఉంటారు. ఎవరినీ చిన్నచూపు చూడరు. ఎవరి సందేహాలనైనా తీర్చడానికి సిద్ధంగా ఉంటారు. సెట్లో అందరినీ గౌరవిస్తారు. ప్రభాస్ తో మాట్లాడేటప్పుడు నాకు ఎప్పుడూ భయంగా అనిపించలేదు. ఆయన మంచితనానికి నేను ఫిదా అయిపోయాను' అంటూ ప్రీతి చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News