Gentleman 2 : హీరో సెట్ కాలే కానీ.. ఆ సీక్వెల్ మూవీకి ఇద్దరు హీరోయిన్లు ఫిక్స్..!
Gentleman 2 : ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్‌ని తీసుకున్నారు. మరో హీరోయిన్‌గా ప్రియాలాల్ నటించనుందని ప్రొడ్యూసర్ కె.టి. కుంజుమోన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.;
Gentleman 2 : యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మూవీ 'జెంటిల్‌మెన్'.. కె.టి. కుంజుమోన్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది..1993లో రిలీజైన ఈ సినిమాలో అర్జున్ సరసన మధుభాల, శుభశ్రీ హీరోయిన్లుగా నటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
జెంటిల్‌మెన్‌కి సీక్వెల్ తీస్తున్నట్లుగా 2020లోనే ప్రకటించారు నిర్మాత కుంజుమోన్... అయితే ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా మాలీవుడ్ బ్యూటీ నయనతార చక్రవర్తిని ఫైనల్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్‌ని తీసుకున్నారు. మరో హీరోయిన్‌గా ప్రియాలాల్ నటించనుందని ప్రొడ్యూసర్ కె.టి. కుంజుమోన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
ఈమె కూడా మలయాళీ నటి కాగా తెలుగులో సత్యదేవ్ హీరోగా వచ్చిన గువ్వా గోరింక సినిమాలో నటించింది. కాగా జెంటిల్‌మెన్ సీక్వెల్ కి హీరో, డైరెక్టర్ ఎవరన్న విషయాన్ని మేకర్స్ వెల్లడించలేదు. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎంఎం కీరవాణిని ఎంపిక చేశారు.