Priyanka Chopra: అప్పుడు సమంత.. ఇప్పుడు ప్రియాంక చోప్రా.. ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..?
Priyanka Chopra: ఎంతోమంది సెలబ్రిటీ కపుల్స్‌ను చూసి ప్రేక్షకులు ఇన్‌స్పైర్ అవుతూ ఉంటారు.;
Priyanka Chopra: ఎంతోమంది సెలబ్రిటీ కపుల్స్‌ను చూసి ప్రేక్షకులు ఇన్‌స్పైర్ అవుతూ ఉంటారు. అసలు కపుల్ అంటే ఇలా ఉండాలి అని వారి జీవిత భాగస్వామితో అలాంటి జీవితాన్ని ఊహించేసుకుంటారు. కానీ ఈ మధ్య అలా ఇన్‌స్పైరింగ్‌గా ఉన్న చాలా జంటలు విడాకులతో విడిపోతున్నాయి. టాలీవుడ్‌లో నాటచైతన్య, సమంతల విడాకుల తర్వాత ఒక బాలీవుడ్ కపుల్ కూడా ఇలాగే విడిపోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి.
ప్రేమకు వయసుతో సంబంధం ఏముంది.. మనసుతో కాని.. ఈ డైలాగ్ మనం చాలామంది నోటివెంట వింటూనే ఉంటాం. అయితే సినీ సెలబ్రిటీలు ఈ విషయాన్ని నిరూపించి పెళ్లిపీటలు కూడా ఎక్కారు. చాలామంది సెలబ్రిటీ కపుల్స్‌లో అమ్మాయికంటే అబ్బాయి చిన్నవాడు అయ్యింటాడు. అయినా వాళ్లు సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తారు. అలాంటి కపుల్స్‌లో ఒకటే ప్రియాంక చోప్రా, నిక్ జోనస్.
ప్రియాంక, నిక్ మధ్య చాలా తేడాలు ఉన్నాయి. వారి భాష ఒకటి కాదు.. వారి మతం ఒకటి కాదు.. ఆఖరికి వారి దేశం కూడా ఒకటి కాదు.. అయినా కూడా ఈ కపుల్ చాలామందికి ఫేవరెట్. ఒకరి గురించి ఒకరు ఎప్పుడు మాట్లాడిన చాలా స్పెషల్‌గా అనిపిస్తుంటుంది. వీరిద్దరు ఎక్కడ కలిసి కనిపించినా కెమెరాలు ఆటోమాటిక్‌గా వీరి వైపు తిరగాల్సిందే. ఇంత క్యూట్ కపుల్‌పై ఇప్పుడు బాలీవుడ్‌లో ఊహించని రూమర్స్ మొదలయ్యాయి.
ఇంతకు ముందు ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ప్రియాంక్ జోనస్ చోప్రా అని ఉండేది. ఇప్పుడు దాన్ని ప్రియంక చోప్రాగా మార్చేసుకుంది. సమంత కూడా నాగచైతన్యతో విడాకులు తీసుకునే కొన్నిరోజుల ముందే తన సోషల్ మీడియా ఎకౌంట్స్ అన్నింటి నుండి అక్కినేని అనే పేరును తొలగించుకుంది. ప్రియాంక చోప్రా కొత్త ఇన్‌స్టా ఐడీ చూసిన ప్రతీ ఒక్కరు సమంత, నాగచైతన్య సంఘటననే గుర్తుచేసుకుంటున్నారు.
కానీ ప్రియాంక, నిక్ కొన్నిరోజుల క్రితం కూడా ఒక ఇంటర్వ్యూలో కలిసి పాల్గొన్నారు. వీరు కలిసి అమెరికాలో తమ డ్రీమ్ హౌస్‌ను నిర్మించుకుని కొన్నిరోజుల కిందటే అక్కడికి మకాం మార్చారు. అంతే కాకుండా దీపావళిని కూడా వారి కొత్తింట్లో సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారు. మొన్నటివరకు సంతోషంగా కలిపించిన వీరి మధ్య ఇంతలో ఏం జరిగింది..? అసలు ప్రియాంక తన ఇన్‌స్టా ఐడీని ఎందుకు మార్చుకుంది అన్న విషయాలపై తనే స్పష్టత ఇవ్వాలి.