Dil Raju: భీమ్లానాయక్ పోస్ట్‌పోన్.. దిల్‌రాజు ఎక్స్‌ప్లనేషన్
Dil Raju: ఈ రెండిటిని దృష్టిలో పెట్టుకునే సినిమాను వాయిదా వేశారని అన్నారు.;
Dil Raju: పవన్‌కళ్యాణ్ భీమ్లానాయక్ మూవీ విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాత దిల్‌రాజు. పాన్ ఇండియా మూవీస్ త్రిపుల్ ఆర్.. జనవరి 7న, రాధేశ్యామ్ జనవరి 14న విడుదల అవుతున్న నేపథ్యంలో.. సంక్రాంతి బరి నుంచి బీమ్లానాయక్ తప్పుకుందని ఆయన అన్నారు.
రెండు తెలుగు సినిమాలు అంతర్జాతీయస్థాయిలో విడుదల అవుతున్న నేపథ్యంలో వాటిని ప్రోత్సహించడానికే హీరో పవన్‌కళ్యాణ్, ప్రోడ్యూసర్ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. అన్ని పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ అయినా.. స్క్రీన్స్ షేరింగ్ ఇబ్బంది అవుతుందని.. ఈ రెండిటిని దృష్టిలో పెట్టుకునే సినిమాను వాయిదా వేశారని అన్నారు.
వరుసగా క్రిస్మస్, న్యూయర్, సంక్రాంతి ఉండటంతో.. భారీ బడ్జెట్ మూవీస్ అన్నీ క్యూలో నిలబడ్డాయి. ఇప్పటికే పుష్ప రిలీజ్ కాగా.. ఈనెల 24న నాని శ్యామ్‌సింగరాయ్ రిలీజ్ అవుతోంది. ఈ సినిమా పైనా భారీ అంచనాలే ఉన్నాయి.
ఈ సినిమా రిలీజ్ అయిన కొద్దిరోజులకే.. హైఅటెన్షన్ మూవీ త్రిపుల్-ఆర్.. జనవరి 7న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతోంది. బాహుబలితో ఇండియా లెవల్‌లో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న ప్రభాస్ రాధేశ్యామ్ మీదా భారీ ఎక్స్‌పర్టేషన్స్ ఉన్నాయి. ఈ మూవీ జనవరి 14న రిలీజ్ అవుతోంది.
ఈ నేపథ్యంలో పవన్‌కళ్యాణ్ బీమ్లానాయక్‌ను వాయిదా వేయడం.. భారీ బడ్జెట్ మూవీస్‌కు ఊరటనిచ్చింది. త్రిపుల్-ఆర్, రాధేశ్యామ్ నిర్మాతలు విజ్ఞప్తితోనే.. భీమ్లానాయక్ నిర్మాతలు వాయిదా నిర్ణయం తీసుకున్నారని దిల్‌రాజు తెలిపారు. భీమ్లానాయక్ ను ఫిబ్రవరి 25న రిలీజ్ చేయనున్నారు.