Puneeth Rajkumar : పునీత్ మరణవార్త ఇంకా ఆమెకి తెలియదట..!
Puneeth Rajkumar : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఇక లేడన్న వార్తను ఇప్పటికి ఎవ్వరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.;
Puneeth Rajkumar : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఇక లేడన్న వార్తను ఇప్పటికి ఎవ్వరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. గతేడాది అక్టోబర్‌లో గుండెపోటుతో పునీత్ మరణించడం అందరిని షాక్‌కి గురిచేసింది. ఇప్పటికి పునీత్‌కి సంబంధించిన జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు అభిమానులు.. నేడు (మార్చి 17)న పునీత్ జయంతి. ఈ రోజున పునీత్ చివరి చిత్రం జేమ్స్ విడుదలైంది.
ఇదిలావుండగా పునీత్ చనిపోయాడన్న వార్త పునీత్ రాజ్‌కుమార్ మేనెత్త, రాజ్‌కుమార్ చెల్లెలు నాగమ్మకు ఇప్పటివరకు తెలియదని అంటున్నారు పునీత్ కుటుంబ సభ్యులు.. వీరి కుటుంబంలో ఆమెనే పెద్దది.. 90 సంవత్సరాలున్న నాగమ్మకి చిన్నప్పటి నుండి అప్పు అంటే చాలా ఇష్టం.. రాజ్‌కుమార్ పిల్లలను చిన్నతనంలో ఆమెనే చూసుకునేదట. ఇప్పుడు అప్పు ఎక్కడ అని ఆమె అడిగితే అవుట్ డోర్ షూటింగ్‌లో ఉన్నాడని చెబుతున్నారట.
గతంలో పునీత్ అన్నయ్య శివ రాజ్ కుమార్‌కు గుండెపోటు వచ్చినప్పుడు ఆమె తట్టుకోలేకపోయారట. దీనితో పునీత్ మరణవార్తను దాచిపెట్టారట. చుట్టుపక్కల వాళ్లు లేదా గ్రామస్తులు ఇంటికి వస్తే పునీత్ గురించి మాట్లాడకుండా జాగ్రత్త పడుతున్నామని తెలిపారు.