Puri Jagannadh : 'అందుకే చిరంజీవితో నా సినిమా ఆగిపోయింది' : పూరీ జగన్నాథ్

Puri Jagannadh : ఫటాఫట్ మూవీస్ చేయడం, షూటింగ్ మొదలు రోజే రిలీజ్ డేట్ అనౌన్సు చేయడం ఇండస్ట్రీలో ఒక్క పూరీకి మాత్రమే చెల్లింది.

Update: 2022-03-30 11:00 GMT

Puri Jagannadh : ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులునప్పటికీ అందులో పూరీ జగన్నాథ్ స్టైల్ వేరు.. ఫటాఫట్ మూవీస్ చేయడం, షూటింగ్ మొదలు రోజే రిలీజ్ డేట్ అనౌన్సు చేయడం ఇండస్ట్రీలో ఒక్క పూరీకి మాత్రమే చెల్లింది. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అయిన రాజమౌళి కూడా పూరీ దగ్గర ఒక్కరోజు అసిస్టెంట్‌‌గా పనిచేస్తానని అన్నాడంటే పూరీ అంటే ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

చిన్న హీరోలను స్టార్ లని, స్టార్ లకి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన పూరీకి మాత్రం ఒక కోరిక అలాగే ఉంది.. అదే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడం.. చిరు రీఎంట్రీ మూవీకోసం పూరీ ఆయనకీ ఓ కథని చెప్పారు.. అయితే సేకాండ్ హాఫ్ బాలేదని ఆ కథని చిరు పక్కన పెట్టారని ఆ మధ్య టాక్ నడిచింది. ఆ తర్వాత చిరు, పూరీ ఎవరి సినిమాల్లో వారు బిజీ అయిపోయారు. ఇదిలావుండగా పూరీ డ్రీం ప్రాజెక్ట్ జనగణమన ఇటీవలే మొదలైంది.

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ఈ మూవీ ప్రకటన సందర్భంలో చిరంజీవితో మూవీ ఏమైందన్న ప్రశ్న పూరీకి ఎదురైంది. దీనిపైన ఆయన మాట్లాడుతూ.. తాను చిరంజీవికి ఓ కమర్షియల్‌ కథ చెప్పానని .. ఆ కథ ఆయనకీ కూడా నచ్చిందని... కాకపోతే ప్రస్తుతం చిరంజీవి సమాజానికి ఉపయోగపడేలా మెసేజ్‌ ఓరియెంటెండ్‌ సినిమాలు చేయాలనీ భావిస్తున్నారని పూరీ చెప్పుకొచ్చారు.

అందుకనే చిరంజీవితో తన ప్రాజెక్ట్ చేజారిపోయిందని తెలిపాడు. అయితే డైరెక్టర్‌‌గా ఆ ఛాన్స్ మిస్ అయినప్పటికీ నటుడిగా ఆయన సినిమాలో నటించే అవకాశం పూరీకి వచ్చిందని విజయ్ దేవరకొండ వెల్లడించాడు. 

Tags:    

Similar News