Puri Jagannadh : గాడ్‌ఫాదర్‌లో పూరీ జగన్నాధ్.. రోల్ ఏంటో తెలుసా?
Puri Jagannadh : ఇందులో బాలవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.. ఒక్క రూపాయి రెమ్యునరేషన్ తీసుకోకుండా సల్మాన్ ఈ సినిమాని చేస్తుండడం విశేషంగా చెప్పుకోవచ్చు..;
Puri Jagannadh : కొరటాల శివ డైరెక్షన్‌లో ఆచార్య మూవీని ఫినిష్ చేసి ఇప్పుడు వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడు మెగాస్టార్ చిరంజీవి.. అందులో ఒకటి గాడ్‌ఫాదర్.. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ చిత్రానికి ఇది రీమేక్.. ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇందులో బాలవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.. ఒక్క రూపాయి రెమ్యునరేషన్ తీసుకోకుండా సల్మాన్ ఈ సినిమాని చేస్తుండడం విశేషంగా చెప్పుకోవచ్చు.. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ అతిధి పాత్రలో కనిపించబోతున్నాడు.. ఇందులో ఆయన జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఉన్నది కొద్దిసేపే అయినప్పటికీ పూరీ రోల్ పవర్ ఫుల్‌గా ఉంటుందట.
ఇక చిరంజీవితో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు పూరీ.. చిరు రీఎంట్రీకి కూడా కథని వినిపించాడు పూరీ.. కానీ వివిధ కారణాల వల్ల ఆ మూవీ సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇప్పుడు చిరుతో ఇలా స్క్రీన్ షేర్ చేసుకుంటున్న పూరీ.. ఏదో రోజ ఆయన్ని డైరెక్షన్ కూడా చేస్తాడని కోరుకుందాం..!