పుష్ప .. సుకుమార్ డైరెక్షన్ లో తగ్గేదే లే అంటూ దూసుకువచ్చిన అల్లు అర్జున్ ఈ మూవీతో ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అంతే కాదు.. పుష్పలోన నటనకు బెస్ట్ యాక్టర్ గానేషనల్ అవార్డ్ అందుకున్నాడు. ఇన్నేళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డ్ అందుకున్న మొదటి హీరోగా చిరకాల కీర్తిని సంపాదించాడు. అయితే కొన్నాళ్లుగా అల్లు అర్జున్ చుట్టూ అనేక వివాదాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల టైమ్ లో మొదలైన ఈ రచ్చ అల్లు అర్జున్ ను మెగా ఫ్యాన్స్ పూర్తిగా దూరం పెట్టేంత వరకూ వెళ్లింది. అయినా ‘నా మనసుకు నచ్చితేనే వెళతా ’ అని ఆ గొడవను ఎండ్ చేసే ఉద్దేశ్యం లేదు అన్నట్టుగా ఆ మధ్య ఓ సినిమా ఫంక్షన్ లో మాట్లాడాడు. దీంతో ఇది జనసేన ఎమ్మెల్యే వరకూ వెళ్లింది వ్యవహారం. దీంతో పుష్ప 2కు చాలా సమస్యలు వస్తాయని తెలుగు స్టేట్స్ మాట్లాడుకంటోన్న టైమ్ లో అనూహ్యంగా పుష్ప 2 నాన్ థియేట్రికల్ బిజినెస్ తోనే ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి ఎంటైర్ కంట్రీకి షాక్ ఇచ్చింది. ఈ రేంజ్ బిజినెస్ ఇప్పటి వరకూ ఏ తెలుగు హీరోకూ లేదంటే పుష్ప 2 క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పుష్ప 2కు నాన్ థియేట్రికల్ బిజినెస్ ను ఓటిటి నుంచి చూస్తే..
పుష్ప 2 ఓటిటి రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా 275 కోట్లు పెట్టి తీసుకుంది. ఇది అన్ని భాషలకూ కలిపిన అమౌంట్. ఇది ఓ తెలుగు సినిమాకు హయ్యొస్ట్ అమౌంట్.
హిందీ థియేట్రికల్ మార్కట్ లో కేవలం అడ్వాన్స్ గానే 200 కోట్లు వచ్చాయి. ఇది అల్లు కెరీర్ లో హయ్యొస్ట్ ఫిగర్.
మ్యూజికల్ / ఆడియో రైట్స్ ను టి సిరీస్ సంస్థ 60 కోట్లకు తీసుకుంది. ఇదీ ఆల్ టైమ్ రికార్డ్.
ఇక శాటిలైట్ మార్కెట్ ఇంకా పూర్తి కాలేదు.. కానీ అన్ని భాషల శాటిలైట్ రైట్స్ తో ఈజీగా 450 - 500 కోట్ల వరకూ వచ్చే అవకాశం చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. దీంతో థియేట్రికల్ రైట్స్ లేకుండానే ఒక తెలుగు సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో 1000 కోట్ల మార్కెట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇది రాజమౌళి డైరెక్షన్ లో నటించిన హీరోల సినిమాల వల్ల కూడా కాలేదు. ఏదేమైనా అల్లు అర్జున్ పై వస్తోన్న ట్రోల్స్, మీమ్స్ కు ఈ ఫిగర్స్ గట్టి సమాధానం చెబుతాయేమో కానీ థియేట్రికల్ రైట్స్ ను బట్టి చూస్తే చాలా పెద్ద స్థాయి సినిమాగా మారబోతోందనుకోవచ్చు. బట్ ఈ మొత్తం రావాలంటే సినిమాలో కూడా ఆ రేంజ్ స్టఫ్ ఉండాలి. అది కీలకం.