Varun Dhavan's Baby John : బేబీ జాన్ పుష్పరాజ్ ఎఫెక్ట్ ..?

Update: 2024-12-18 13:45 GMT

సౌత్ ఇండియన్ మూవీస్ ఇప్పుడు నార్త్ ను రూల్ చేస్తున్నాయి. బాహుబలి నుంచి మొదలైన ఈ హవాను పీక్స్ కు తీసుకువెళ్లింది పుష్ప 2. మధ్యలో సాహో, కేజీఎఫ్ రెండు పార్ట్ లు, దేవర, సలార్, కల్కి కూడా కమర్షియల్ గా బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. విశేషం ఏంటంటే.. మన సినిమాలతో పాటుగా బాలీవుడ్ మూవీస్ కూడా విడుదలైతే వాటిని అక్కడి ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. దీనికి తోడు బాక్సాఫీస్ వద్ద అవన్నీ డిజాస్టర్ అయ్యాయి. ఈ కారణంగా అక్షయ్ కుమార్, అజయ్ దేవ్ గణ్, షాహిద్ కపూర్ లాంటి పేరున్న హీరోలు కూడా ఫేడవుట్ అయ్యారా అన్నంతగా ఫెయిల్యూర్స్ చూస్తున్నారు. వీరిలో షాహిద్ కపూర్ కెరీర్ ను నిలబెట్టింది మళ్లీ మన సందీప్ రెడ్డి వంగానే. ఈ టైమ్ లో ఓ సౌత్ మూవీకి ఇప్పుడు అక్కడ కాస్త గడ్డు పరిస్థితులు కనిపించడం విశేషం.

తమిళ్ లో అట్లీ డైరెక్షన్ లో విజయ్, సమంత, ఎమీజాక్సన్ ప్రధాన పాత్రల్లో నటించిన తెరి చిత్రాన్ని అట్లీ తమిళ్ లో ‘బేబీ జాన్’పేరుతో రీమేక్ చేశాడు. అయితే అక్కడ తను కేవలం ప్రొడ్యూసర్ మాత్రమే. దర్శకత్వ బాధ్యతలు కలీస్ కు ఇచ్చాడు. అక్కడి ఆడియన్స్ తో పాటు ఇప్పుడు వచ్చిన ట్రెండ్ ను బట్టి కొన్ని మార్పులు చేశారు. ఇంకా చెబితే ప్రస్తుతం నార్త్ ఆడియన్స్ కు ఊరమాస్ మూవీస్ బాగా కనెక్ట్ అవుతున్నాయి.. ఆ మషాలాలు ఈ బేబీ జాన్ లో యాడ్ అయ్యాయి.

విజయ్ పాత్రలో వరుణ్ ధావన్ నటించగా కీర్తి సురేష్, వామికా గబ్బి ఫీమేల్ లీడ్ లో కనిపించనున్నారు. ఈ నెల 25న క్రిస్మస్ సందర్భంగా విడుదల కాబోతోన్న ఈ మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అట్లీ స్వయంగా వెళ్లి ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నాడు. రీసెంట్ గానే పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ కూడా ప్రమోషన్స్ లో యాడ్ అయింది. కాకపోతే ఈ మూవీకి అక్కడ వీళ్లు ఎక్స్ పెక్ట్ చేసినంత బజ్ రావడం లేదు. కారణం .. ఇంకా పుష్పరాజ్ హవా కంటిన్యూ అవుతుండటమే. నార్త్ ఆడియన్స్ ఇంకా పుష్ప 2 ఫ్లేవర్ నుంచి బయటకు రాలేదు. వచ్చి ఉంటే బేబీ జాన్ ప్రమోషన్స్ ను చూసి ఉండేవారు. ఈ మూవీకీ బజ్ క్రియేట్ అయ్యేది. సోషల్ మీడియాతో పాటు ఇతర ప్లాట్ ఫామ్స్ లో చర్చలు సాగేవి. బట్ ఈ చిత్రానికి అవేం కనిపించడం లేదు. పైగా వరుణ్ కూడా ప్రస్తుతం లో ఫేజ్ లోనే ఉన్నాడు. ఇవన్నీ కలిపి నార్త్ ఆడియన్స్ కు నచ్చే అంశాలున్నట్టు కనిపిస్తున్నా.. బేబీజాన్ పై హైప్ లేకుండా చేశాయి. మరి రిలీజ్ టైమ్ లో అయినా ఈ చిత్రానికి కాస్త హైప్ వస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News