ఐకన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ఇండియన్ మూవీ రికార్డ్స్ ను తిరగరాసింది. ఓ సాధారణ కమర్షియల్ మూవీగా రూపొందిన పుష్ప 2 బాహుబలి 2 రికార్డ్స్ ను కనుమరుగు చేయడం ఎంటైర్ తెలుగు ఆడియన్స్ ను షాక్ కు గురి చేసింది. రష్మిక మందన్నా, ఫహాద్ ఫాజిల్, రావు రమేష్, జగపతిబాబు సినిమాకు ఎసెట్ గా నిలిచారు. నిజానికి ఫహాద్ విలనీని, క్యారెక్టర్ ను సరిగా డిజైన్ చేసుకోలేదు. ప్రధాన విలన్ అని చెప్పడానికి ఎవరూ లేకున్నా.. ఈ మూవీ అంత పెద్ద విజయం సాధించడం ఆశ్చర్యమే.
అల్లు అర్జున్ పర్సనల్ లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ కూడా తెచ్చిన ఈ మూవీ ఆ ప్రాబ్లమ్ రిజల్ట్ పై లేకుండా దూసుకుపోయింది. కాకపోతే తెలుగు స్టేట్స్ లో మాత్రం ఆశించినంత విజయం సాధించలేదు. ఇక ఈ మూవీ నిడివిపైనా కొన్ని కామెంట్స్ వచ్చాయి. ఒరిజినల్ గానే 3 గంటల 18 నిమిషాల సినిమా. ఈ మధ్య కాలంలో యానిమల్ తర్వాత అంత ఎక్కువ నిడివి ఉన్న సినిమా ఇదే. ఇదే ఎక్కువ అనుకుంటే ఇప్పుడు మరో 20 నిమిషాల ఫుటేజ్ ను యాడ్ చేయబోతున్నారు. ఈ విషయంపైనా కొన్ని కామెంట్స్ వచ్చాయి. అయినా మూవీ టీమ్ అవేం పట్టించుకోకుండా దూసుకుపోతోంది. ఈ ఎక్స్ ట్రా ఫుటేజ్ ను ఈ నెల 11 నుంచి యాడ్ చేయబోతున్నారు. అప్పటి నుంచి పుష్ప 2 మూడు గంటల 38 నిమిషాలు ఉండబోతోందన్నమాట. నార్త్ లో పుష్పరాజ్ కు ఉన్న క్రేజ్ చూస్తే ఈ 20 నిమిషాల నిడివి మరో 20 కోట్లు తెచ్చినా ఆశ్చర్యం లేదు అనే చెప్పాలి.