Pushpa: తగ్గేదేలే.. భయంకరమైన లుక్‌లో' పుష్ప' విలన్
Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న మూవీ 'పుష్ప'.;
Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ 'పుష్ప'. అటవి బ్యాక్‌డ్రాప్‌లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీని దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. హిందీ, తమిళ, తెలుగు, మళయాల, కన్నడ భాషల్లో ఈ మూవీ రానుంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీలోని తొలిపార్ట్ 'పుష్ప ది రైజ్' పేరుతో క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లుఅర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన దాక్కో దాక్కో మేక సాంగ్ విడుదల చేసిన యూనిట్.. ఇప్పుడు మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ లుక్ విడుదల అయింది. 'విలన్ ఆఫ్ పుష్ప' పేరుతో ఫహద్ ఫస్ట్‌లుక్‌ను షేర్ చేసింది. ఫహద్ ఫాజిల్ ఇందులో భన్వర్ సింగ్ షెకావత్ అనే పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా పాత్రలో కనిపించనున్నారు. సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.