Pushpa Trailer: 'పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా..? ఫైర్..'
Pushpa Trailer: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమా ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది;
Pushpa Trailer (tv5news.in)
Pushpa Trailer: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'పుష్ప' సినిమా ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా నుండి ఇప్పటికీ ట్రైలర్ విడుదల కాకపోయినా.. పాటలు, పోస్టర్లతోనే సినిమాపై అంచనాలు పెంచేసాడు సుకుమార్. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పుష్ప ట్రైలర్ ఈరోజు సాయంత్రం 6.03కు విడుదల కావాల్సి ఉంది. కానీ టెక్నికల్ సమస్యల వల్ల కాలేదు.
ఇక ఈరోజు ట్రైలర్ లేదేమో అనుకుంటున్న సమయంలోనే పుష్ప ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ట్రైలర్ టీజ్‌లో ఫాస్ట్ ఫార్వడ్‌లో కనిపించిన ఎలిమెంట్స్ అన్నీ ట్రైలర్‌లో ఉన్నాయి. మాస్ ఆడియన్స్‌కు సినిమా ఫుల్ ఫీస్ట్ అని స్పష్టంగా అర్థమవుతోంది. ఇక ట్రైలర్ చివర్లో అల్లు అర్జున్ చెప్పిన 'పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా..? ఫైర్' అనే డైలాగు ఆడియన్స్‌తో విజిల్స్ వేయించేలా ఉంది.