Pushpa Trailer: పుష్ప టీమ్ వెరైటీ ఐడియా.. ట్రైలర్ టీజ్ అంటూ..
Pushpa Trailer: సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమా డిసెంబర్ 17న విడుదల కానుంది.;
Pushpa Trailer: సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'పుష్ప' సినిమా డిసెంబర్ 17న విడుదల కానుంది. పుష్ప ది రైజ్‌గా విడుదల కానున్న ఈ సినిమా మొదటి భాగం కోసం చాలామంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. విడుదల తేది దగ్గర పడుతుండడంతో మూవీ టీమ్ ఈరోజు పుష్ప ట్రైలర్‌ను విడుదల చేస్తామని ప్రకటించింది. కానీ ట్రైలర్‌కు బదులు ట్రైలర్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది.
ట్రైలర్ అంటేనే సినిమా కంటెంట్ ఏంటో చెప్పనట్టుగా చెప్తూ మూవీపై ఇంట్రెస్ట్ కలిగించేది. దానికంటే కాస్త నిడివి తక్కువగా ఉండేదే టీజర్. కానీ టీజర్ కాకుండా, ట్రైలర్ కాకుండా పుష్ప నుండి ఈ ట్రైలర్ టీజర్ ఏంటి అని నెటిజన్లు అనుకుంటున్నారు. పుష్ప ట్రైలర్ టీజ్ పేరుతో విడులదయిన ఈ 29 సెకన్ల వీడియోలో ఏ పాత్రను కూడా క్లియర్‌గా చూపించలేదు సుకుమార్. ట్రైలర్ కావాలంటే డిసెంబర్ 6 వరకు వేచిచూడాల్సిందే అని స్పష్టం చేశాడు.