ఐకన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఆల్రెడీ ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే 1000 కోట్లు కొల్లగొట్టిందీ మూవీ. ఇలాంటి రికార్డ్ ఇంతకు ముందు మరే తెలుగు సినిమాకూ లేదు అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ఓటిటి డీల్ ఎంటైర్ కంట్రీని సర్ ప్రైజ్ చేసింది. పుష్ప 1 తెలుగులో అబౌ యావరేజ్ అయినా నార్త్ లో అదరగొట్టింది. ఈ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. ఇక సుకుమార్ టేకింగ్ కు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. సమంత సాంగ్, శ్రీ వల్లిగా రష్మిక నటనతో పాటు అనసూయ, సునిల్, అజయ్ ఘోష్, ధనంజయ్ లాంటి వారి నటన సినిమాకు హైలెట్ గా నిలిచింది. సెకండ్ హాఫ్ లోనే వచ్చినా.. సినిమా అంతా ఇంపాక్ట్ ఉండేలా ఫహాద్ ఫాజిల్ నటన కనిపించింది. భైరాన్ సింగ్ షెకావత్ గా అతనే ఇప్పుడు సెకండ్ పార్ట్ లో కీలకం కాబోతున్నాడు. ఇవన్నీ కలిపే పుష్ప 2 అంచనాలను నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళ్లాయి.
డిసెంబర్ 5న విడుదల కాబోతోన్న పుష్ప 2 ట్రైలర్ ను ఈ నెల 17న బిహార్ రాష్ట్రంలోని పట్నాలో రిలీజ్ చేయబోతున్నారు. లాస్ట్ మినిట్ హడావిడీ లేకుండా ట్రైలర్ ను లాక్ చేశారు. తాజాగా ఈ ట్రైలర్ సెన్సార్ కూడా పూర్తయింది. ట్రైలర్ నిడివి 2. 44 నిమిషాలు. అంటే రెండు నిమిషాల 44 సెకన్స్ ఉంటుందన్నమాట. ఈ ట్రైలర్ తో పుష్పరాజ్ రూలింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వేర్వేరు స్టేట్స్ లో ప్రమోషనల్ ఈవెంట్స్ ఉండబోతున్నాయి. ఇవన్నీ సినిమాను అంచనాలకు మించేలా ఆడియన్స్ కు కనెక్ట్ చేయబోతున్నారు.
ఇక ట్రైలర్ లోనే గూస్ బంప్స్ వచ్చే సీన్స్ కనిపిస్తాయట. అలాగే ఊహించని అంశాలు కూడా ఉండబోతున్నాయంటున్నారు. మొత్తంగా ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంబరాలకు సిద్ధం కావొచ్చన్నమాట.