PUTIN: భారతీయ సినిమాలపై రష్యన్ల ప్రేమ

రష్యాలో భారత్‌ సినిమా ఛానల్.. ఇలాంటి టీవీ ఛానల్‌ ఉన్న ఏకైక దేశంగా రష్యా.. కెనడాలో భారతీయ సినిమాలకు నిరసన సెగ

Update: 2025-10-04 06:30 GMT

భారత్-రష్యా మధ్య మంచి దౌత్యసంబంధాలు పెంపొందుతున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతీయ చిత్ర పరిశ్రమపై ఉన్న అభిమానాన్ని వెల్లడించారు. భారతీయ సినిమాలంటే రష్యన్లకు అమితమైన అభిమానమన్నారు. రష్యా ప్రజలు భారతీయ సినిమాలను కేవలం వినోదం కోసం కాకుండా సంస్కృతి, సంప్రదాయాలను ఆస్వాదిస్తారని పేర్కొన్నారు. అందుకే ప్రజాదరణ పొందుతున్న భారతీయ సినిమాలను పగలు, రాత్రి ప్రసారం చేయటానికి ప్రత్యేక ఛానెల్ ఉన్నట్టు తెలిపారు. ఇలా నిరంతర ప్రసారాలు చేస్తున్న ఏకైక దేశం బహుశా రష్యా కావొచ్చని రష్యా అధ్యక్షుడు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇరు దేశాలను కలిపే సాధనం

నల్ల­స­ము­ద్రం­లో­ని రి­సా­ర్ట్‌ నగరం సో­చి­లో జరి­గిన చర్చా కా­ర్య­క్ర­మం­లో పు­తి­న్‌ పా­ల్గొ­న్నా­రు. ఈ సం­ద­ర్భం­గా అధ్య­క్షు­డు మా­ట్లా­డు­తూ... భా­ర­తీయ సి­ని­మా­ల­పై తన అభి­మా­నా­న్ని వ్య­క్తం చే­శా­రు. ‘భారత దే­శ­మే కాదు.. భా­ర­తీయ సి­ని­మా­లం­టే తమ దే­శ­స్థు­ల­కు చాలా ఇష్ట­మ­న్నా­రు. భా­ర­త్-రష్యా సం­బం­ధా­లు కే­వ­లం రా­జ­కీ­యా­లు, దౌ­త్యా­ని­కే పరి­మి­తం కా­కుం­డా.. సాం­స్కృ­తిక, మా­న­వీయ సం­బం­ధాల పరం­గా కూడా వి­స్త­రిం­చా­య­న్నా­రు. రష్యా­లో అనేక మంది భా­ర­తీయ వి­ద్యా­ర్థు­లు చదు­వు­తు­న్నా­ర­ని తె­లి­పా­రు. వారి ద్వా­రా భా­ర­తీయ సం­స్కృ­తి, ము­ఖ్యం­గా సి­ని­మా­ల­కు రష్యా ప్ర­జ­ల్లో వి­స్తృత ఆదరణ ఏర్ప­డిం­ద­న్నా­రు. భా­ర­తీయ సి­ని­మా­లు రెం­డు దే­శాల ప్ర­జ­ల­ను ఒక­దా­ని­తో ఒకటి కలి­పే సా­ధ­నం అని పు­తి­న్ వె­ల్ల­డిం­చా­రు.

సోవియెట్‌ కాలం నుంచే..

కాగా సోవియట్ కాలం నుంచే రష్యాలో భారతీయ సినిమాలకు మంచి గుర్తింపు ఉంది. ఆ దేశంలో మిథున్ చక్రవర్తి, రాజ్‌కపూర్ వంటి స్టార్ హీరోలకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. మిథున్ చక్రవర్తి నటించిన 'డిస్కో డాన్సర్' 1982లో విడుదలైంది. ఈ చిత్రం సోవియట్ యూనియన్‌లో అత్యధిక వసూళ్లను సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. అలాగే రాజ్‌కపూర్ నటించిన 'ఆవారా' సైతం విదేశాల్లో 100 మిలియన్లకు పైగా టిక్కెట్లు అమ్ముడైన భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

బాలీవుడ్‌పై ప్రశంసలు

గతేడాది BRICS సదస్సులో కూడా పుతిన్ భారతీయ సినిమాలు, బాలీవుడ్‌పై ప్రశంసలు కురిపించారు. తమ దేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్నట్టు తెలిపారు. బ్రిక్స్ సభ్య దేశాల్లో సినిమా షూటింగ్‌లకు రష్యా ప్రోత్సాహకాలు అందిస్తుందా అంటే రష్యాలో భారతీయ చలనచిత్రాలకు అధిక ప్రజాదరణ ఉందని భావిస్తున్నట్టు తెలిపారు. మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో బ్రిక్స్ దేశాల్లోని సినిమాలను పరిచయం చేస్తామన్నారు. రష్యాలో కేవలం బాలీవుడ్ సినిమాలే కాకుండా టాలీవుడ్, కోలీవుడ్ సహా పలు భాషల సినిమాలు మంచి ఆదరణ పొందుతున్నాయి. టెలివిజన్, యూట్యూబ్, OTT ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా ప్రతి రోజు భారతీయ సినిమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

Tags:    

Similar News