కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన రాయన్ మూవీ రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్, సన్ నెక్ట్స్ దక్కించుకున్నాయి. ఈ నెల 30 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో అపర్ణ, సందీప్ కిషన్, దుషారా విజయన్ కీలక పాత్రల్లో నటించారు. రాయన్ సినిమాలో ధనుష్ చెల్లెలు దుర్గగా దుషారా విజయన్ అద్భుతంగా నటించింది. అలాగే కాళిదాస్ జయరామ్, వరలక్ష్మి శరత్ కుమార్, శరవణన్, దిలీపన్, ఇళవరసు.. తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. ఇక రాయన్ తర్వాత డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర చిత్రంలో నటిస్తున్నాడు ధనుష్. ఇందులో అక్కినేని నాగార్జున మరో కీలక పాత్రలో కనిపించనుండగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది. ఇది వరకే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి.