పదితలలు రావణుడితో పోరుకొరకే కదిలాడు.. ఇక ఎవడు ఆపగలడు దహనం చేస్తాడు.. తెగబడిన రాక్షసులతో నేడు సహనం మరిచాడు.. ఇక ఎవడూ ఆపగలడు.. మరణం రాస్తాడు.. అంటూ విజయ్ దేవరకొండ కింగ్ డమ్ నుంచి తాజాగా వచ్చిన పాట టైటిల్ కు తగ్గట్టుగానే ఆ సినిమా స్ఫూర్తిని రగిలించేలా ఉంది. మృత్యువు జడిసేలా, శతృవు బెదిరేలా.. గర్జన తెలిసేలా.. దెబ్బకు కదిలేలా పద పదా అంటూ సినిమా థీమ్ ను తెలిపేలా హీరో కర్తవ్యాన్ని చూపిస్తూ సాగిన సాహిత్యం సైతం ఆకట్టుకుంటోంది.
అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన సినిమా ఇది. ఈ పాటను కృష్ణకాంత్ రాయగా సిద్ధార్థ్ బస్రూర్ పాడాడు. ఈ గొంతు తెలుగువారికి అంత పరిచితం కాదు. కానీ కృష్ణకాంత్ సాహిత్యం మాత్రం ఇప్పటి వరకూ వచ్చిన పాటలకు భిన్నంగా ఉంది. ఎక్కువగా లవబుల్ సాంగ్స్ తో ఆకట్టుకుంటాడతను. ఇలా క్యారెక్టర్ ను ఎలివేట్ చేస్తూ ఈ తరహా ఫైరింగ్ లిరిక్స్ తో అంత ఎక్కువ రాయలేదిప్పటి వరకు. అయినా అదరగొట్టాడు.
ఇక ఈ గురువారం విడుదల కాబోతోన్న ఈ చిత్రాన్ని సితార, ఫార్చూన్ బ్యానర్స్ నిర్మించాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. సత్యదేవ్ ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. సినిమాపై అంచనాలను పెంచడంలో టీమ్ సక్సెస్ అయింది. ప్రమోషన్స్ కు టైమ్ పెద్దగా పెట్టుకోలేదు. కేవలం రెండు ఈవెంట్స్, ట్రైలర్ తోనే ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ఈ మూవీ విజయం విజయ్ దేవరకొండకు అత్యంత కీలకం. మరి సాధిస్తాడా లేదా అనేది చూడాలి.