Saripodha Sanivaaram Collections : సరిపోదా శనివారంకు వర్షాల షాక్

Update: 2024-08-31 10:04 GMT

నాని, ప్రియాంక మోహన్, ఎస్.జే. సూర్య నటించిన సరిపోదా శనివారం గ్రాండ్ గా స్టార్ట్ అయింది. ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా 24 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అది వర్కింగ్ డే కాబట్టి ఆ కలెక్షన్స్ చాలా ఎక్కువ అనే చెప్పాలి. శుక్రవారం వచ్చే సరికి ఈ కలెక్షన్స్ తగ్గాయి. అందుకు కారణం వర్షాలు. మామూలుగా వీకెండ్ టైమ్ లో ఫ్రైడే నైట్ బుకింగ్స్ ఎక్కువగా ఉంటాయి. శుక్రవారం నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో నాన్ స్టాప్ గా వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా రెండో వసూళ్లపై ప్రభావం పడింది. శనివారం అర్థరాత్రి నుంచి నాన్ స్టాప్ వర్షం కురుస్తూనే ఉంది. ఏదైనా అత్యవస పని ఉంటే తప్ప బయటకు రావొద్దు అని రెండు రాష్ట్రాల్లోని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆ రేంజ్ లో ఉంది వాన. ఇక విజయవాడ నగరం చాలా యేళ్ల తర్వాత వానల కారణంగా అతలాకుతలం అవుతోంది.

హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని చాలా జిల్లాలు వర్షాలకు వణికిపోతున్నాయి. ఇది ఖచ్చితంగా సరిపోదా శనివారంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందనే చెప్పాలి. పైగా మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సో.. మంచి టాక్ వచ్చింది. రివ్యూస్ బావున్నాయి. అయినా ప్రకృతి కారణంగా నాని సినిమా వసూళ్లపై తీవ్ర ప్రభావం పడిందనే చెప్పాలి. విశేషం ఏంటంటే.. ఇక్కడ ఇలా ఉంటే.. రెండు రోజులకే నార్త్ అమెరికాలో ఒన్ మిలియన్ క్లబ్ లో చేరింది సరిపోదా శనివారం.

Tags:    

Similar News