Rajamouli: 'ఆర్ఆర్ఆర్' మూవీ టీమ్, రాజమౌళి మధ్యలో మహేశ్.. ట్వీట్ రేపిన చిచ్చు..
Rajamouli: శివకార్తికేయన్ నటించిన ‘డాన్’ సినిమా సక్సెస్ గురించి ఆర్ఆర్ఆర్ టీమ్ ట్వీట్ చేసింది.;
Rajamouli: 'ఆర్ఆర్ఆర్'తో మరోసారి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులందరి చూపును తనవైపు తిప్పుకున్నాడు రాజమౌళి. ఎన్‌టీఆర్, రామ్ చరణ్ మల్టీ స్టారర్‌గా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్‌కు ఇంకా క్రేజ్ ఉంది కాబట్టే సినిమాను ఓటీటీలో పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ చేయడానికి మూవీ టీమ్ సిద్ధమయ్యింది. అయితే ఇంతలోనే రాజమౌళిపై మహేశ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు. ఒక ట్వీట్ రాజమౌళికి ఎన్నో నెగిటివ్ కామెంట్స్‌ను తెచ్చిపెడుతోంది.
ఆర్ఆర్ఆర్ తర్వాత మహేశ్ బాబుతో సినిమా ప్లాన్ చేశాడు రాజమౌళి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. అయితే ఇంతలోనే ఓ ట్వీట్ మహేశ్ ఫ్యాన్స్‌లో రాజమౌళిపై నెగిటివిటీని పెంచేసింది. ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ అప్పట్లో క్రియేట్ చేసిన ట్విటర్ అకౌంట్ ఇంకా యాక్టివ్‌గానే ఉంది. అయితే తాజాగా ఆ అకౌంట్ నుండి ఓ ట్వీట్ వచ్చింది.
శివకార్తికేయన్ నటించిన 'డాన్' సినిమా సక్సెస్ గురించి ఆర్ఆర్ఆర్ టీమ్ ట్వీట్ చేసింది. దీంతో సర్కారు వారి పాట గురించి ట్వీట్ చేయలేదు కానీ అదే సమయంలో విడుదలయిన డాన్ సినిమా గురించి ట్వీట్ చేస్తారా అంటూ మహేశ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆర్ఆర్ఆర్ విడుదలయినప్పుడు మహేశ్ ప్రత్యేకంగా వారికి విష్ చేశాడు. కానీ మహేశ్ సినిమాకు ఇలా చేస్తారా అంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
Congratulations to our dearest @Siva_Kartikeyan and the entire team of #DON on the blockbuster success! ❤️🤗@Dir_Cibi @anirudhofficial @iam_SJSuryah @thondankani @SKProdOffl @LycaProductions @KalaiArasu_ @Udhaystalin
— RRR Movie (@RRRMovie) May 15, 2022