Rajamouli: 'ఆర్ఆర్ఆర్'లో వారి క్యారెక్టర్సే స్పెషల్: రాజమౌళి
Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా రోజుకొక ఆసక్తికర విషయం బయటికి వస్తోంది.;
Rajamouli (tv5news.in)
Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా రోజుకొక ఆసక్తికర విషయం బయటికి వస్తోంది. ప్రమోషన్స్ విషయంలో బిజీగా ఉన్న ఆర్ఆర్ఆర్ టీమ్.. పలు భాషల ప్రేక్షకులతో, మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇదే సమయంలో రాజమౌళి, రామ్ చరణ్, ఎన్‌టీఆర్ తమ వ్యక్తిగత విషయాలతో పాటు ఆర్ఆర్ఆర్‌కు సంబంధించిన విశేషాలను కూడా బయటపెడుతున్నారు.
ఇప్పటికే ఆర్ఆర్ఆర్‌లోని కొన్ని కీలక విషయాల గురించి బయటపెట్టాడు రాజమౌళి. ఇందులో రామ్ చరణ్ ఎంట్రీ సీన్ హైలెట్‌గా నిలుస్తుందని, యాక్షన్ సీన్లు సినిమాకు కీలకం అని ఇలా ఎన్నో విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్న బాలీవుడ్ నటీనటులవి గెస్ట్ రోల్స్ మాత్రమే అని రివీల్ చేశాడు రాజమౌళి.
ఆర్ఆర్ఆర్‌లో తెలుగు నటీనటులు మాత్రమే కాదు.. బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్.. ఇలా అన్ని భాషలకు సంబంధించిన నటీనటులు ఉన్నారు. ట్రైలర్‌లో కూడా ప్రతీ పాత్రను క్లియర్‌గా చూపించే ప్రయత్నం చేశాడు రాజమౌళి. అయితే ఇందులో నటిస్తున్న బాలీవుడ్ నటులు అజయ్ దేవగన్, ఆలియా భట్‌వి పూర్తి స్థాయి పాత్రలు కాదని.. కేవలం గెస్ట్ రోల్సే అని రివీల్ చేశాడు. కాకపోతే ఈ సినిమాకు వారివి చాలా స్పెషల్ క్యారెక్టర్స్ అని పేర్కొన్నాడు. హాలీవుడ్ నటీనటులకు మాత్రం ఇందులో పూర్తిస్థాయి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశాడు.