Rajamouli Mahabharata: పాన్ వరల్డ్ స్థాయిలో 'మహాభారత'.. అందులోనూ ఎన్‌టీఆర్, రామ్ చరణ్..!

Rajamouli Mahabharata: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

Update: 2021-12-29 15:23 GMT

Rajamouli Mahabharata: 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అందుకే ఈ సినిమాకు ప్రమోషన్స్ విషయంలో కూడా మూవీ టీమ్ ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ప్రతీ రాష్ట్రానికి వెళ్తూ.. ఆర్ఆర్ఆర్ సినిమాను అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గర చేయాలని మూవీ టీమ్ అనుకుంటోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో రాజమౌళి ఓ కీలక ప్రకటన చేశాడు.

రాజమౌళికి మాత్రమే కాదు.. టాలీవుడ్, బాలీవుడ్‌లలో ఎంతోమందికి డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారత'. బడ్జెట్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా చాలామంది నటులు, దర్శకులు ఈ ఇతిహాస కథపై సినిమాను తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అయితే ఈ ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టి వెనక్కి తగ్గారు. కానీ రాజమౌళి మాత్రం దీనిని ఎలాగైనా వెండితెరపై చూడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే బాహుబలి లాంటి ఒక ఫిక్షనల్ కథతో టాలీవుడ్ మార్కెట్‌ను పెంచిన రాజమౌళి.. హిస్టరీతో ఫిక్షన్‌ను కలిపి 'ఆర్ఆర్ఆర్'ను తెరకెక్కించాడు. అయితే పూర్తి ఇతిహాస కథతో మహాభారతాన్ని తెరకెక్కించే ప్లాన్ తనకు ఉందంటూ ఇటీవల బయటపెట్టాడు రాజమౌళి. అందులో ఎన్‌టీఆర్, రామ్ చరణ్ తప్పకుండా నటిస్తారని.. అంతకు మించి వివరాలు తాను ఇప్పుడే వెల్లడించలేనని అన్నాడు. ఆర్ఆర్ఆర్ విడుదల సమయంలోనే మహాభారత గురించి చెప్పడం వల్ల కచ్చితంగా ఆ ప్రాజెక్ట్ ఉంటుందేమో అనుకుంటున్నారు ప్రేక్షకులు.

Tags:    

Similar News