రాజమౌళి అంటే తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శక దిగ్గజం. సినిమా ప్రపంచాన్ని శాసిస్తున్న ఒక లెజెండ్. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి డౌట్ లేదు. అంతర్జాతీయ స్థాయిలో తన సినిమాను నిలబెట్టుకోగలిగే ఒక దర్శకుడికి ఏం మాట్లాడాలో.. ఎలా మాట్లాడాలో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజమౌళి ఒక అద్భుతమైన విజనరీ. ఎలా ప్లాన్ చేయాలి, ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా మాట్లాడాలి అనేది ఆయనకు చాలా బాగా తెలుసు. అలాంటి రాజమౌళి ఉన్న వారణాసి ఈవెంట్ లో కొంచెం టంగ్ స్లిప్ అయ్యారు. ఒకరకంగా అది ఆయనలోని ఆవేదన అని చెప్పుకోవచ్చు.
ఇండియన్ సినిమా హిస్టరీలోని అతిపెద్ద ఈవెంట్ ను నిర్వహించారు. హాలీవుడ్ రిపోర్టర్లను కూడా పిలిచారు. ఈవెంట్ ను ఇంటర్నేషనల్ లెవెల్ లో ప్రమోట్ చేయాలని ఈవెంట్ కోసం రాజమౌళి చాలా కష్టపడ్డారు. కానీ టెక్నికల్ ప్రాబ్లం వల్ల గ్లింప్స్ వీడియో అరగంట ఆలస్యం అయింది. అంత కష్టపడితే అంత పెద్ద స్క్రీన్ మీద వీడియో ప్లే చేయాలని ప్లాన్ చేస్తే అరగంట ఆలస్యం అయ్యేసరికి రాజమౌళి కొంత అసంతృప్తికి గురయ్యారు.
ఆ అసంతృప్తిలోనే ఆయన మాట్లాడుతూ.. తన తండ్రి, తన భార్య హనుమంతుడిని ఎంతో నమ్ముతారని.. కానీ ఇలా జరిగిందేంటని అన్నారు. నా వెనకాల హనుమంతుడు ఉన్నాడని ఆయనే అన్ని చూసుకుంటాడని నా తండ్రి చెబుతుంటారు. ఇలాగేనా చూసుకోవడం అని ఒక ఇంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకేముంది ఈ కామెంట్స్ పై రచ్చ రచ్చ జరుగుతుంది.
రాజమౌళి ఒక దేవుడిని పట్టుకొని ఇలా అవమానిస్తాడా అంటూ హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే కొందరు రాజమౌళి పై సరూర్నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ఇక్కడ రాజమౌళి కావాలని అన్నట్టు కనిపించట్లేదు. ఆయన ఒక రకంగా దేవుడిపై అలిగినట్టు తన మాటలను బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే రాజమౌళి వారణాసి సినిమాలు హనుమంతుడిని, రాముడిని అద్భుతంగా చూపించబోతున్నారు. దేవుడిపై ఆయనకు కోపం ఉందని అనుకోవద్దు. ఒకరకంగా ఆయన హనుమంతుడిపై అలిగి అలాంటి కామెంట్లు చేశారని అర్థం చేసుకోవచ్చు. రాముడు గురించి హనుమంతుడు గురించి నిజంగా రాజమౌళి కంటే గొప్పగా ఎవరూ చూపించలేరు అని గ్లింప్స్ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయంలో రాజమౌళి ఒక క్లారిటీ ఇస్తే వివాదం ముగిసిపోయినట్టే అవుతుంది.