Shekar Trailer : రాజశేఖర్ 'శేఖర్' ట్రైలర్ వచ్చేసింది..!
Shekar Trailer : రాజశేఖర్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన మూవీ శేఖర్.. జీవిత రాజశేఖర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.;
Shekar Trailer : రాజశేఖర్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన మూవీ శేఖర్.. జీవిత రాజశేఖర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. కరోనా వలన పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం మే 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఈ క్రమంలో మేకర్స్ చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
''పోలీస్ యూనిఫామ్ వేసుకొని కూడా డ్యూటీ చేయని వాళ్లు చాలామంది ఉంటారు. అదే, పోలీస్ ఉద్యోగానికి రిజైన్ చేసి కూడా డ్యూటీ కోసం ప్రాణాలిచ్చే వాళ్లు వేలల్లో ఒక్కరే ఉంటారు'' అంటూ సమీర్ చెప్పే డైలాగ్ తో మొదలైన శేఖర్ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. రాజశేఖర్ యంగ్ అండ్ ఓల్డ్ లుక్స్ లో ఈ సినిమాలో కనిపించనున్నారు.. ఆయన కూతురు శివాని ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నారు.
మలయాళంలో సూపర్ హిట్ ఐన 'జోసెఫ్' సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, బొగ్గారం వెంకట శ్రీనివాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమా పైన ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.