స్టార్ ఇమేజ్ ని తలకెక్కించుకోని రజనీ.. 10-12 రోజులు ఆలయంలో నివసిస్తాడు: చాల్‌బాజ్ దర్శకుడు

Update: 2025-08-14 08:49 GMT

"నేను పర్వతాలకు వెళ్తాను, 10-12 రోజులు ఆలయంలో నివసిస్తాను, నేలను శుభ్రం చేస్తాను, నేలపై పడుకుంటాను, వినయంగా ఉండటానికి" అని రజనీకాంత్ చాల్‌బాజ్ దర్శకుడు పంకజ్ పరాశర్‌తో అన్నారు.

రజనీకాంత్ సినిమా ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తవుతుంది. తన 171వ చిత్రం ' కూలీ' విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో సూపర్ స్టార్ ను తరతరాలుగా ఎందుకు ప్రేమిస్తున్నారో మనకు గుర్తు చేస్తాయి కొన్ని కథలు. చాల్‌బాజ్ (1989)లో అతనితో కలిసి పనిచేసిన దర్శకుడు పంకజ్ పరాషర్, కొన్ని మరపురాని క్షణాలను గుర్తుచేసుకున్నాడు.

"రజనీకాంత్ చాలా చురుకైనవాడు," అని పరాశర్ అన్నారు. " చాల్‌బాజ్ సినిమా శ్రీదేవి సినిమా అని అతను గ్రహించాడు. అతను అహంకారి, సూపర్ హీరో  పాత్రను పోషిస్తే అది పనిచేయదు. కాబట్టి, అతను దానిని కామెడీగా మార్చాడు. భయపడే వ్యక్తిగా, చాలా మంది సూపర్ స్టార్లు ఎప్పటికీ చేయని పాత్రను పోషించడానికి అతను అంగీకరించాడు. అతను అద్భుతమైన నటనను కనబరిచాడు. ఈ చిత్రంలో, అతను దయ్యాలకు భయపడతాడు, ఆ పాత్ర అతన్ని చాలా ప్రేమించదగినవాడిగా మార్చింది."

సెట్‌లో, రజనీకాంత్ తరచుగా శ్రీదేవిని సరదాగా పిలిచే పేరుతో పిలిచేవారు. "ఆమె లోపలికి వచ్చిన ప్రతిసారీ అతను వంగి 'శ్రీదేవా!' అని బిగ్గరగా అనేవాడు. 

రజనీ స్వంతగా కారు నడిపిన సంఘటనను గుర్తు చేసుకున్న పరాశర్

ఓ రోజు “అతను స్వయంగా కారు నడిపాడు. అసిస్టెంట్ లేడు, మేనేజర్ లేడు, 1960ల నాటి పాత ఫియట్ కారు అది. ఒకరోజు అతను నన్ను నా హోటల్‌లో డ్రాప్ చేయడానికి వచ్చాడు. అక్కడ వేడిగా ఉంది, కారులో ఏసీ పనిచేయడం లేదు, కాబట్టి నేను కిటికీని దించాను. ఎవరైనా అతన్ని చూస్తే గందరగోళం ఏర్పడుతుంది కాబట్టి అతను నన్ను అలా చేయవద్దని చెప్పాడు. కానీ నేను అతడి మాట వినలేదు. సిగ్నల్ వద్ద, ఇద్దరు వ్యక్తులు గమనించి 'తలైవా!' అని అరిచారు. తరువాత మరింత మంది చేరారు. దాంతో ట్రాఫిక్ జామ్ అయింది. తల్లులు ఆశీస్సుల కోసం తమ పిల్లలను కారు బానెట్‌పై ఉంచారు. దాంతో పోలీసులు రావాల్సి వచ్చింది. అప్పుడే నేను అతని స్టార్‌డమ్‌ను చూశాను.”

దేవాలయాలను శుభ్రం చేసే సూపర్ స్టార్

సూపర్ స్టార్ హోదా ఉన్నప్పటికీ, రజనీకాంత్ ఎప్పుడూ తనను తాను ఒక సామాన్య వ్యక్తిలా ఉండడానికే ఇష్టపడతారు. "అతను ఒకసారి నాతో ఇలా అన్నాడు, 'ప్రజలు నన్ను పూజిస్తారు, అది తలపైకి ఎక్కవచ్చు. కాబట్టి నేను పర్వతాలకు వెళ్తాను, 10-12 రోజులు ఆలయంలో నివసిస్తాను, నేలను శుభ్రం చేస్తాను, నేలపై పడుకుంటాను. ఇదంతా నేనేంటో నాకు గుర్తు చేస్తుంది అని చెప్పాడని పరాశర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 

రజనీకాంత్ తన సంపదను సమాజ హితం కోసం ఉపయోగిస్తారని, సామాన్య ప్రజలు ఉచితంగా వివాహం చేసుకోవడానికి ఆడిటోరియంలను నిర్మించారని పరాశర్ తెలిపారు. 

అభిమానులకు రజనీకాంత్ కేవలం సూపర్ స్టార్ మాత్రమే కాదని, ఐదు దశాబ్దాల సినిమా చరిత్ర ఉన్నా వినయంతో కూడిన ఆయన వ్యక్తిత్వాన్ని మరోసారి అభిమానులకు గుర్తు చేస్తాయి ఇలాంటి సంఘటనలు. 

Tags:    

Similar News