ఇంటికి చేరుకున్న రజనీకి హారతితో స్వాగతం!
సూపర్‌స్టార్ రజనీకాంత్ చెన్నైలోని తన నివాసానికి చేరుకున్నారు. తన కుమార్తెతో కలిసి ఆదివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో చెన్నైకి చేరుకున్న రజినీ, అక్కడ ఎయిర్‌పోర్ట్ నుంచి కారులో ఇంటికి చేరుకున్నారు.;
సూపర్‌స్టార్ రజనీకాంత్ చెన్నైలోని తన నివాసానికి చేరుకున్నారు. తన కుమార్తెతో కలిసి ఆదివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో చెన్నైకి చేరుకున్న రజినీ, అక్కడ ఎయిర్‌పోర్ట్ నుంచి కారులో ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వచ్చిన ఆయనకు.. హారతి ఇచ్చి స్వాగతం పలికారు రజనీ సతీమణి లత. ఇటీవల రక్తపోటులో హెచ్చుతగ్గుల కారణంగా రజనీ హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో చేరారు.
ప్రస్తుతం తలైవా ఆరోగ్యం నిలకడగా ఉందని, 7రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. రజినీ ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్న రజినీ అభిమానులు అయన ఇంటివద్దకు చేరుకొని స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా కరోనా వల్ల రజనీ నటిస్తున్న 'అన్నాత్తే' సినిమా షూటింగ్ ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆగిపోయింది.