లోకేష్ కనకరాజ్ సినిమా అంటే ఎలా ఉంటుంది అనే క్లారిటీ ఎప్పుడో ఇచ్చేశాడతను. కాకపోతే స్టార్స్ పెరుగుతున్నా కొద్దీ అతనికి మరింత ఊపు వస్తుంది అనేలా ఉంటుంది. ఆల్మోస్ట్ అయిపోయాడు అనుకున్న కమల్ హాసన్ ను విక్రమ్ తో తిరిగి ఫామ్ లోకి తెచ్చాడు. అలాంటిది ఫామ్ లోనే రజినీకాంత్ తో సినిమా అంటే ఎలా ఉంటుందీ అంటే.. ఇదుగో ఇలా ఉండబోతోందీ అంటూ వచ్చాడు ట్రైలర్ తో. వీరి కాంబోలో రూపొందిన కూలీ మూవీ ఈ నెల 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ట్రైలర్ చూస్తుంటేనే రజినీ ఫ్యాన్స్ కు పూనకాలు లోడింగ్ గ్యారెంటీ అని ప్రామిస్ చేసినట్టు కనిపిస్తోంది.
ఈ ట్రైలర్ లో అందరికంటే హైలెట్ గా కనిపిస్తున్నది మాత్రం డౌటే లేకుండా నాగార్జున. నాగ్ ను ఇలాంటి విలన్ పాత్రలో చూడటం తెలుగు వాళ్లు ఎలా రిసీవ్ చేసుకుంటారో కానీ.. ఆయన మాత్రం క్రూరమైన నెగెటివ్ రోల్ నే చేస్తున్నట్టు కనిపిస్తోంది. షిప్ యార్డ్ నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తుంది. షిప్ యార్డ్ అండే అన్ని రకాల స్మగులింగ్స్, ఇల్లీగల్ ట్రాఫికింగ్స్ అడ్డాగా కూడా సినిమాల్లో చూస్తుంటాం. ఓ మాంచి మాస్ కంటెంట్ ను ఆ యార్డ్ నుంచి బిల్డ్ అవుతుంది. 30యేళ్ల క్రితం ఆ యార్డ్ ను వదిలేసిన 'దేవా' అన్నేళ్ల తర్వాత తిరిగి అక్కడ అడుగుపెట్టడం అది కూడా తన ప్రాణ స్నేహితుడి కోసం కావడం.. ఆ స్నేహితుడి కూతురు శృతి హాసన్ అవడం.. తన స్నేహితుడిని కాపాడుకోవడానికి అత్యంత క్రూరుడైన సైమన్ ను ఢీ కొట్టడం.. ఇందుకోసం తన పాత స్నేహితులైన ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ ల సాయం తీసుకోవడం.. చూస్తుంటే కొంత జైలర్ సెటప్ లా ఉన్నా.. లోకేష్ చేసే మ్యాజిక్స్ వేరే ఉంటాయి కదా. అందుకే కూలీ ట్రైలర్ చూడగానే బ్లాక్ బస్టర్ మెటీరియల్ అని ఫిక్స్ అయిపోయేలా ఉంది.
ఏదేమైనా సైమన్ నాగ్ మాత్రం ఖచ్చితంగా సౌత్ ఆడియన్స్ కు సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడు అనిపిస్తోంది. సౌబిర్ షబీన్ కూడా నెగెటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు. శృతి హాసన్ తో పాటు కన్నడ హీరోయిన్ రచితా రామ్ కూడా ఉంది. అలాగే సినిమా మొత్తానికి కీలకమైన పాత్రగా సత్యరాజ్ కనిపిస్తున్నాడు. ఇక అనిరుధ్ మరోసారి సూపర్ స్టార్ కోసమే బ్యాక్ బోన్ కాబోతున్నాడు అనేది క్లియర్ గా తెలుస్తోంది. ఏదేమైనా ఓ గ్రాండ్ స్కేల్ లో లార్జర్ దన్ లైఫ్ క్యారెక్టర్స్ తో ఆడియన్స్ కు గూస్ బంప్స్ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ పక్కా అని అర్థం అవుతోంది.