Rakhi Sawant: ప్రేమికుల రోజు విడాకులు.. నటి ఎమోషనల్ పోస్ట్
Rakhi Sawant: ఒకరినొకరు అర్థం చేసుకున్నామని అనుకుంటారు.. డేటింగ్‌లు చేస్తారు.. అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు చేసుకుంటారు..;
Rakhi Sawant: ఒకరినొకరు అర్థం చేసుకున్నామని అనుకుంటారు.. డేటింగ్‌లు చేస్తారు.. అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు చేసుకుంటారు.. ఏ ఇద్దరి అభిప్రాయాలు ఒకటి కాకపోయినా పెళ్లి అనే బంధంతో ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ ముందుకు సాగుదామనుకుంటారు.. కానీ పది, ఇరవై ఏళ్లు అయిన తరువాత కూడా విడిపోతున్న జంటల్ని చూస్తున్నాము.. పెళ్లయిన ఏడాది, రెండేళ్లలోనే విడిపోతున్న జంటల్నీ చూస్తున్నాము. ఈ మధ్య ఈ విడాకుల కల్చర్ మరీ ఎక్కువైంది.. ఇగోలను పక్కన పెడితే ప్రతి బంధమూ ప్రేమైకమే అవుతుంది..
తాజాగా మరో నటి తన భర్తతో విడిపోతున్నట్టు ప్రకటించింది. బాలీవుడ్ నటి, నర్తకి, మోడల్ అయిన రాఖీ సావంత్ భర్త రితేష్ నుండి విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. టెలివిజన్ టాక్ షోకి హోస్ట్‌గానూ చేస్తున్న రాఖీ హిందీ, కన్నడ, మరాఠీ, ఒడియా, తెలుగు, తమిళ సినిమాలలో కనిపించింది. టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్ 1 మొదటి సీజన్‌లోనూ, 14 సీజన్‌లోనూ పాల్గొంది. వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకున్న రాఖీ భర్త నుంచి విడిపోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది.
రాఖీ సావంత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో.. ప్రియమైన స్నేహితులు మరియు శ్రేయోభిలాషులు.. రితేష్, నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాము. రియాలిటీ షో బిగ్ బాస్ తర్వాత చాలా జరిగింది. నా నియంత్రణలో లేని కొన్ని విషయాల గురించి నాకు అసలు తెలియవు. విభేదాలను పరిష్కరించడానికి చాలా ప్రయత్నించాను. కానీ నా ప్రయత్నం ఫలించలేదు. దాంతో మేము ఇద్దరం స్నేహపూర్వకంగా ముందుకు సాగడం ఉత్తమమని భావించాను.
మేమిద్దరం విడివిడిగా బ్రతకాలని నిర్ణయించుకున్నాము. ఎవరి జీవితాల్లో వారు ఆనందంగా ఉండాలని అనుకున్నాము. వాలెంటైన్స్ డేకి ముందే ఇది జరగాల్సింది. కానీ నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. విడిపోతున్నామని తెలియజేయడానికి నేను నిజంగా చాలా బాధపడుతున్నాను.. నా హృదయం బరువెక్కుతోంది.. అని రాఖీసావంతో ఇన్‌స్టాలో ఎమోషన్ పోస్ట్ పెట్టింది.
వైల్డ్ కార్డ్ ఎంట్రీగా షోలోకి ప్రవేశించిన తన భర్త రితేష్‌ను బిగ్ బాస్ 15లో ప్రపంచానికి పరిచయం చేసింది రాఖీ సావంత్.