Rakul Preet Singh : తెలుగులో అతడే నా ఫేవరేట్ హీరో : రకుల్
Rakul Preet Singh : కెరటం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది..;
Rakul Preet Singh : కెరటం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.. అలా అతికొద్ది టైంలోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.. తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ బాషల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది.
ఇటీవలే ఆటాక్ మూవీతో ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులు, ఫాలోవర్లతో ఇంటరాక్ట్ అయ్యింది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్‌లో పాల్గొన్న రకుల్‌ను తెలుగులో మీ ఫేవరేట్ హీరో ఎవరని ప్రశ్నించాడు ఓ నెటిజన్.. దీనిపైన స్పందించిన రకుల్... అల్లు అర్జున్ అని చెప్పేసింది. \
బన్నీ, రకుల్ కాంబినేషన్‌లో సరైనోడు సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులో చివరగా కొండపోలం సినిమాలో నటించిన రకుల్.. ప్రస్తుతం 31 అక్టోబర్ లేడిస్ నైట్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.