Rakul Preet Singh: బాయ్‌ఫ్రెండ్ గురించి అడిగినందుకు రకుల్ స్ట్రాంగ్ రిప్లై..

Rakul Preet Singh: రిలేషన్‌లో ఉండడం అనేది సర్వసాధారమైన వ్యవహారం అని తెలిపింది రకుల్.

Update: 2022-04-18 13:40 GMT

Rakul Preet Singh (tv5news.in)

Rakul Preet Singh: ఒరిజినల్‌గా ఢిల్లీలో పుట్టి పెరిగినా.. కన్నడ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయినా.. తెలుగులోనే నటిగా గుర్తింపు తెచ్చుకుంది రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం తాను సౌత్ సినిమాలకు పూర్తిగా దూరమయ్యి బాలీవుడ్‌పైనే దృష్టిపెట్టింది. రకుల్ ఇటీవల తాను హీరో జాక్కీ భగ్నానీతో రిలేషన్‌లో ఉన్న విషయాన్ని బయటపెట్టింది రకుల్. దాని గురించి తాజాగా స్పందించింది కూడా.


బాలీవుడ్ ప్రముఖ నిర్మాత విషు భగ్నానీ కుమారుడే జాక్కీ భగ్నానీ. జాక్కీ పలు సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. అయితే రకుల్ తన పుట్టినరోజు సందర్భంగా జాక్కీతో రిలేషన్‌లో ఉన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది. అప్పటినుండి ఎక్కడికి వెళ్లినా తన బాయ్‌ఫ్రెండ్ గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయని కౌంటర్ ఇచ్చింది రకుల్.

రిలేషన్‌లో ఉండడం అనేది సర్వసాధారమైన వ్యవహారం అని తెలిపింది రకుల్. ఇది ప్రతీ ఒక్కరి జీవితంలో జరిగేదే అని చెప్పింది. అమ్మ, నాన్న, తమ్ముడు ఎలా ఉంటారో.. అదే విధంగా జీవిత భాగస్వామి ఉంటారు కదా అని ఈ విషయంపై స్పందించింది. అందుకే తమ విషయం గురించి ఏదైనా చెప్పాల్సిన సందర్భం వస్తే తానే స్వయంగా చెప్తానని క్లారిటీ ఇచ్చింది. ప్రతి ఇంటర్వ్యూలోనూ తన గురించి చెప్పాల్సిన అవసరం నాకు లేదంది రకుల్.

Tags:    

Similar News