Rakul Preet Singh: బాయ్‌ఫ్రెండ్‌తో రకుల్ ఫారెన్ టూర్..
Rakul Preet Singh: రకుల్ బాయ్‌ఫ్రెండ్ జాకీతో తనకు గల సంబంధాన్ని ధృవీకరించింది.;
Rakul Preet Singh: వైష్ణవ్‌తేజ్‌తో నటించిన కొండపొలం రకుల్‌ని నిరాశ పరిచింది.. ఆ తరువాత తెలుగులో అవకాశాలే లేవు.. దాంతో బాలీవుడ్ బెటర్ అనుకుని అక్కడే సెటిల్ అయింది.. న్యూ ఇయర్ వేడుకలను బాయ్‌ఫ్రెండ్ జాకీ భగ్నానీతో కలిసి లండన్‌లో జరుపుకుంది.. కోవిడ్ కేసుల పెరుగుదల, లాక్‌డౌన్ పుకార్ల మధ్య ఈ జంట తిరిగి ముంబై చేరుకున్నారు.
గత ఏడాది అక్టోబర్‌లో తన 31వ పుట్టినరోజు సందర్భంగా రకుల్ బాయ్‌ఫ్రెండ్ జాకీతో తనకు గల సంబంధాన్ని ధృవీకరించింది. కాగా, టైగర్ ష్రాఫ్‌తో కలిసి తన ప్రొడక్షన్ వెంచర్ గణపత్ షూటింగ్ కోసం చాలా రోజుల నుంచి జాకీ యూకేలో ఉన్నారు. ఈ చిత్రంలో కృతి సనన్ కూడా నటిస్తోంది. రకుల్ ఆయుష్మాన్ ఖురానాతో డాక్టర్ జి, అజయ్ దేవగణ్‌తో రన్‌వే 34, జాన్ అబ్రహంతో ఎటాక్, ఇండియన్ 2 ప్రాజెక్టులతో బిజీగా ఉంది.