మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 50లక్షల సాయం అందించాడు. అంటే ఎవరికి.. అనే ప్రశ్న వస్తుంది కదా. యస్.. ఈ మధ్య కాలంలో తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ కు ఎన్నికలు జరిగాయి కదా. ఆ ఎన్నికల్లో జానీ మాస్టర్ భార్య ఆయేషా ఎన్నిక అయింది కదా. ఈ ఎన్నికలు జానీ మాస్టర్ చాలా ప్రిస్టీజియస్ తీసుకున్నాడు. మరోవైపు శేఖర్ మాస్టర్ కూడా పోటీలో ఉన్న టీమ్ కు సపోర్ట్ గా ఉన్నాడు. బట్ ఆయేషానే ఎన్నిక విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చాడు జానీ మాస్టర్.
ఈ హామీల్లో ఒక భాగం డ్యాన్సర్స్ అందరికీ హెల్త్ కార్డ్స్ అందించాలనుకున్నాడు. ఆ హెల్త్ కార్డ్స్ ను రామ్ చరణ్ అందించాలనుకున్నాడు. అంటే జానీ మాస్టర్ కోరికే అయినా కూడా ఇందులో భాగంగా రామ్ చరణ్ ముందుకు వచ్చాడు. అంటే కేవలం జానీ మాస్టర్ కోరిక మాత్రమే కాదు.. డ్యాన్సర్స్ అందరికీ ఉపయోగపడాలి అనే కారణంతోనే చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఏదేమైనా అందరికీ హెల్త్ కార్డ్స్ ఇచ్చేందుకు ఏకంగా 50లక్షలు సాయం అందించడం మాత్రం చిన్న విషయమేం కాదు.