Ram charan Tej : రామ్ చరణ్, శంకర్‌ల మూవీకి అదిరిపోయే టైటిల్..!
Ram charan Tej : ఇందులో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్, అంజలి, సునీల్ తదితరలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.;
Ram charan Tej : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోంది.. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాని టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ఇందులో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్, అంజలి, సునీల్ తదితరలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు.
అయితే ఈ మూవీ టైటిల్ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 'సర్కారోడు' అనే టైటిల్‌ను ఈ సినిమా కోసం మేకర్స్ లాక్ చేసినట్టుగా తెలుస్తోంది. రామ్ చరణ్ బర్త్ డే (మార్చి 27న )సందర్భంగా టైటిల్ తో కూడిన పోస్టర్ ని రిలీజ్ చేయనున్నారట. ఇందులో రామ్ చరణ్ యంగ్ అండ్ డైనమిక్ సీఎంగా కనిపించనున్నారని టాక్.
శంకర్, రామ్ చరణ్ కాంబో అన్నప్పుడే సినిమా పైన అంచనాలు భారీగా పెరిగిపోయాయి.. కాగా ప్రస్తుతం ఆచార్య, RRR మూవీస్ చేసిన చరణ్ శంకర్, గౌతమ్ తిన్ననూరి మూవీస్ ని లైన్ లో పెట్టాడు.