Game Changer, Pushpa 2 : రామ్ చరణ్ వర్సెస్ అల్లు అర్జున్ ..
రామ్ చరణ్ వర్సెస్ అల్లు అర్జున్ .. ఈ డిసెంబర్ చాలా యేళ్లు యాదుంటది అనేలా ఓ కొత్త వార్ స్టార్ట్ కాబోతోంది టాలీవుడ్ లో. మరి వార్ నేపథ్యం ఏంటీ.. ఎవరి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి..;
రామ్ చరణ్ వర్సెస్ అల్లు అర్జున్ .. ఈ డిసెంబర్ చాలా యేళ్లు యాదుంటది అనేలా ఓ కొత్త వార్ స్టార్ట్ కాబోతోంది టాలీవుడ్ లో. మామూలుగా ఇద్దరూ ఒకే కాంపౌండ్ నుంచి వచ్చారు. బట్ స్టార్డమ్స్ పెరిగిన తర్వాత కొత్త కుంపట్లు స్టార్ట్ అయ్యాయి. మెగా ట్యాగ్ ను వదిలేసుకుని అల్లు అన్న బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు అర్జున్. దీంతో ఎప్పటి నుంచో మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఆర్మీ అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేసుకుంటున్నారు. ఇక రీసెంట్ గా ఏపి ఎలెక్షన్ టైమ్ లో అల్లు అర్జున్ సొంత వారిని కాదని వెళ్లాడు. అప్పటి నుంచి మెగా ఫ్యామిలీ కూడా మరింత గరమ్ గా ఉన్నారు అతనిపై. ఈ టైమ్ లో రామ్ చరణ్, అర్జున్ సినిమాలు ఒకేసారి విడుదలైతే ఎలా ఉంటుంది. యస్.. ఫ్యాన్ వార్ పీక్స్ కు వెళుతుంది. రికార్డుల లెక్కలు స్టార్డమ్స్ ను తేలుస్తాయి. ఈ డిసెంబర్ లో అదే జరగబోతోందా అంటే అవుననే అంటున్నారు.
ఈ యేడాది డిసెంబర్ మూడో వారంలో క్రిస్మస్ సందర్భంగా అల్లు అర్జున్, సుకుమార్ ల పుష్ప 2 విడుదలవుతుందని గతంలోనే చెప్పారు. ఫస్ట్ పార్ట్ కూడా డిసెంబర్ లోనే వచ్చి బ్లాక్ బస్టర్ అయింది. మరోసారి అదే రిపీట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్. ఈ మధ్య కొన్ని రూమర్స్ వచ్చినా ఖచ్చితంగా ఆ టైమ్ కు ఖచ్చితంగా వస్తాం అని చెబుతున్నారు మేకర్స్. వస్తుందని కూడా అంతా అనుకుంటున్నారు.
ఇక డిసెంబర్ లోనే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కూడా విడుదల కాబోతోందనే వార్తలు వినిపిస్తుండటం.. అందుకు ఎక్కువ ఆస్కారం ఉండటంతో వెంటనే ఈ డిసెంబర్ రామ్ చరణ్ వర్సెస్ అల్లు అర్జున్ గా మారింది.
గేమ్ ఛేంజర్ పై ప్రస్తుతం బజ్ అయితే లేదు. దీనికి తోడు శంకర్ రూపొందించిన భారతీయుడు 2 ఆల్ టైమ్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలవడంతో మెగా ఫ్యాన్స్ కూడా ఆశలు వదులుకున్నట్టే కనిపిస్తున్నారు. అలాగని శంకర్ ను తక్కువ అంచనా వేయలేం. ఓ కొత్త నేపథ్యంలో చరణ్ ను చూపించబోతున్నాడు. అది కనెక్ట్ అయితే బ్లాక్ బస్టర్ గ్యారెంటీ. ఓ రకంగా
ఇటు ఈ సారి ఏపిలో ఐకన్ స్టార్ కు పొలిటికల్ ప్రెజర్ కూడా ఉంటుంది. సినిమా ఏ మాత్రం తేడా కొట్టినా చాలామంది కాచుకుని ఉన్నారు. బ్లాక్ బస్టర్ అయినా ఆ రేంజ్ ను తగ్గించేందుకూ ఛాన్స్ ఉంది. ఇది అల్లు అర్జున్ కు మైనస్ అయితే.. రామ్ చరణ్ సినిమాకు ఏకైక మైనస్ శంకర్ మాత్రమే అంటే కూడా తప్పేం లేదు. మరి ఈ డిసెంబర్ లో తగ్గేదెవరో నెగ్గేదెవరో చూద్దాం.