Ram Charan : త్రివిక్రమ్ తో రామ్ చరణ్.. ఫిక్స్ అయినట్టేనా..?

Update: 2025-06-10 10:45 GMT

మొన్నటి వరకూ చాలామంది స్టార్ హీరోలు ఖచ్చితంగా వర్క్ చేయాలనుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. చివరగా అల వైకుంఠపురములోతో బ్లాక్ బస్టర్ కొట్టిన త్రివిక్రమ్ ఆపై మరో సినిమా చేయడానికి నానా తంటాలు పడుతున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ మూవీ చేయాల్సి ఉంది. కానీ కథ నచ్చలేదని ఎన్టీఆర్.. కొరటాల శివతో దేవరకు వెళ్లిపోయాడు. దీంతో త్రివిక్రమ్ కు మరింత గ్యాప్ వచ్చింది. పుష్ప 2 తర్వాత తనతో హ్యాట్రిక్ మూవీస్ చేసిన అల్లు అర్జున్ తో మైథలాజికల్ సినిమా అన్నారు. భారీ బడ్జెట్ అని.. ఇప్పటి వరకూ మైథాలజీలో ఈ యాంగిల్ లేదు అంటూ ఊదరగొట్టారు. బట్ అల్లు అర్జున్ కూడా హ్యాండ్ ఇచ్చేసి అట్లీతో సినిమా మొదలుపెట్టేశాడు. కట్ చేస్తే ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమా అనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇది టాక్ మాత్రమే కాదు.. నిజంగానే ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతోంది అంటోంది టాలీవుడ్.

త్రివిక్రమ్ తో రామ్ చరణ్ అనే మాట కొత్తగా ఏం లేదు. అల్లు అర్జున్.. అట్లీతో వెళ్లిపోయిన దగ్గర నుంచీ ఉంది. ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో ‘పెద్ది’అనే సినిమా చేస్తున్నాడు చరణ్. తర్వాత సుకుమార్ తో ఉండబోతోంది అనే వార్తలు కూడా వచ్చాయి. ఆ విషయాన్ని కన్ఫార్మ్ కూడా చేశారు. అయితే తాజాగా సుకుమార్ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తో సినిమా చేస్తున్నాడు అనే న్యూస్ వచ్చింది. పైగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతోంది. సో.. సుకుమార్ అటు వెళ్తే రామ్ చరణ్ ఇటు త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడు అంటున్నారు. ఇప్పటికే చరణ్ కు స్టోరీ నెరేట్ చేశాడనీ.. త్వరలోనే ఈ కాంబోలో సినిమా అఫీషియల్ గా అనౌన్స్ అవుతుందని స్ట్రాంగ్ గా వినిపిస్తోంది.

ఓ రకంగా రామ్ చరణ్ కు కూడా ఇది ఛేంజ్ ఓవర్ లా ఉంటుంది. త్రివిక్రమ్ స్టైల్ వేరే ఉంటుంది. ఆయన స్కూల్ డిఫరెంట గా ఉంటుంది. క్లాస్ ను, మాస్ ను మిక్స్ డ్ గా ఆకట్టుకుంటాడు. పైగా టైమింగ్ తెలిసేలా మాంచి పంచ్ లు ఉంటాయి. అదీ కాక ఫస్ట్ టైమ్ కాంబినేషన్ కాబట్టి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.

Tags:    

Similar News