Ram Gopal Varma: సొంత రాష్ట్రంలో రాజమౌళికి ఆ ఫ్రీడమ్ లేదు: వర్మ

Ram Gopal Varma: సినిమా టికెట్ రేట్ల వివాదాన్ని రామ్ గోపాల్ వర్మ విడిచిపెట్టే సమస్య లేదన్నట్టు పట్టుపట్టి కూర్చున్నారు.

Update: 2022-01-11 07:14 GMT

Ram Gopal Varma: సినిమా టికెట్ రేట్ల వివాదాన్ని రామ్ గోపాల్ వర్మ విడిచిపెట్టే సమస్య లేదన్నట్టు పట్టుపట్టి కూర్చున్నారు. ఆయనకు ఇండస్ట్రీ నుండి పెద్దగా సపోర్ట్ దక్కకపోయినా.. ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇటీవల ఈ ఇష్యూ విషయంలోనే ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రాఫీ మంత్రి పేర్ని నానితో సమావేశమయిన ఆర్‌జీవీ.. ఆ సమావేశం వల్ల పెద్దగా ఫలితం ఏదీ లేదని చెప్పకనే చెప్పారు. అందుకే మరోసారి ట్విటర్‌లోనే తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.

ముందుగా టాలీవుడ్ తరపున ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల రేట్ల విషయంలో ఆర్జీవీ ఓ ముందడుగు వేశాడు. ఇతర హీరోలు కూడా ఈ విషయంపై స్పందించినా.. సపోర్ట్ లేకపోవడంతో వారి గొంతును పెద్దగా వినిపించలేకపోయారు. కానీ వర్మ మాత్రం తనకు ఎవరూ సపోర్ట్ చేసినా, చేయకపోయినా ట్విటర్ ద్వారా తన పోరాటాన్ని మొదలుపెట్టారు. అలాగే పేర్ని నాని దగ్గర నుండి పిలుపు అందుకున్నారు.

పేర్ని నానితో సమావేశం అయిన తర్వాత కూడా వర్మ.. తాజాగా ఓ ట్వీట్ చేశారు. 'మహారాష్ట్రలోని మల్టీప్లెక్స్‌లలో 'ఆర్ఆర్ఆర్' సినిమా టికెట్ ధర రూ.2,200 ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వం రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్‌ను రూ.2,200 అమ్ముతుంది. కానీ ఆయన సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రూ.200కు అమ్మే స్వాతంత్రం కూడా లేదు' అని రాజమౌళిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ.


Tags:    

Similar News