Ram Gopal Varma: 'ఇండియన్ సినిమాకు వీరప్పన్ మీరు'.. ప్రశాంత్ నీల్‌పై ఆర్జీవీ కామెంట్స్
Ram Gopal Varma: వర్మ కేజీఎఫ్2 పై ప్రశంసలు కురిపిస్తున్నాడు. మరోసారి ప్రశాంత్ నీల్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.;
Ram Gopal Varma: 'కేజీఎఫ్ 2' సినిమా కేవలం శాండిల్‌వుడ్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా.. సౌత్ ఇండస్ట్రీనే గొప్ప అని బాలీవుడ్ వాళ్లు మరోసారి ఒప్పుకునేలా చేసింది. కేజీఎఫ్ 2 చూసినప్పటి నుండి రామ్ గోపాల్ వర్మ కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నాడు. తాజాగా మరోసారి ప్రశాంత్ నీల్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు వర్మ.
ఇటీవల డైరెక్టర్స్ డే సందర్భంగా ఆర్జీవి తన స్టైల్‌లో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌లో ప్రత్యేకంగా ప్రశాంత్ నీల్ గురించే ప్రస్తావించాడు వర్మ. అంతే కాకుండా మరోసారి కేజీఎఫ్ 2 బడ్జెట్ గురించి కూడా తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఇక తన స్టైల్‌లో ఉన్న ఈ ట్వీట్ కాసేపట్లోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
'బాలీవుడ్ మాత్రమే కాకుండా టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్‌వుడ్‌లో ప్రతీ ఒక్క డైరెక్టర్ మైండ్‌ను బ్లాక్ చేసినందుకు ప్రశాంత్ నీల్‌కు అన్‌హ్యాపీ డైరెక్టర్స్ డే. నువ్వు ఇండియన్ సినిమాకే వీరప్పన్' అంటూ ట్వీట్ చేశాడు వర్మ. అంతే కాకుండా కొందరు రీ షూటింగ్ పేరుతో వందల కోట్లు ఖర్చు చేస్తారని, ప్రశాంత్ నీల్ అలా ఏమీ చేయకుండానే వందల కోట్లు సంపాదించాడని అన్నారు ఆర్జీవీ.