రామ్ పోతినేని హీరోగా నటిస్తోన్న మూవీ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ అనేది ఉప శీర్షిక. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో ఆంధ్రాకింగ్ పాత్రలో కన్నడ స్టార్ ఉపేంద్ర కనిపించబోతున్నాడు. అతని లుక్ కు సంబంధించిన పోస్టర్స్ కూడా ఆకట్టుకున్నాయి. అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టితో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీని రూపొందించిన మహేష్ బాబు పి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఆంధ్రాకింగ్ తాకూకాకు వివేక్ - మెర్విన్ ద్వయం సంగీతం అందిస్తున్నారు.
రీసెంట్ గా వచ్చిన గ్లింప్స్ ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని నవంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు. సో.. రామ్ ఫ్యాన్స్ కు ఇది మంచి స్వీట్ న్యూస్ అనుకోవచ్చు. కొన్నాళ్లుగా రామ్ హిట్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా హిట్ మాత్రం రావడం లేదు. బట్ ఈ సారి టైటిల్ అనౌన్స్ మెంట్ ముందు నుంచే ఈ మూవీపై చాలా కాన్ఫిడెన్స్ గా కనిపిస్తున్నాడు. అటు ఫ్యాన్స్ కూడా ఆంధ్ర కింగ్ తాలూకా తమ హీరోను ఫ్లాపుల నుంచి గట్టెక్కిస్తుందని నమ్ముతున్నారు. మరి ఈ కింగ్ రామ్ పోతినేని ఫేట్ మారుస్తాడా లేదా అనేది చూద్దాం.