RC 15 : రామ్ చరణ్ కిల్లర్ వర్కౌట్స్.. ఆ మూవీ కోసమే..
RC 15 : మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్ కిల్లర్ వర్కౌట్ వీడియో షేర్ చేశారు;
RC 15 : మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్ మామూలుగానే ఫిట్‌గా ఉంటారు. శంకర్ దర్శకత్వంలో వస్తున్న RC 15కి మరింత ఫిట్‌నెస్ అవసరముంది. అందుకే సెలబ్రిటీ జిమ్ ట్రయినర్ రాకేశ్ ఉడియార్ అండర్‌లో చరణ్ వర్కవుట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా ఆయన తన ఇన్స్‌టాలో పోస్ట్ చేశారు. సండే మార్నింగ్ కిల్లర్ వర్కవుట్ విత్ రాకేశ్ ఉడియార్ అని పోస్ట్ చేశారు.
ప్రముఖ దర్శకుడు శంకర్ ఈ సినిమాను తెరకెక్కించనుండడంతో క్రేజ్ ఆమాంతం పెరిగింది. కియారా అడ్వానీ హీరోయిన్‌గా నటించనున్నారు. శ్రీకాంత్, అంజలి మెయిన్ సపోర్టింగ్ రోల్స్ ప్లే చేయనున్నారు. దిల్ రాజు ఈ మూవీని నిర్మించనుండగా తమన్ సంగీతాన్ని సమకూర్చనున్నారు.