Naga Chaitanya : నాగ చైతన్య కోసం రానా త్యాగం

Update: 2024-10-21 07:31 GMT

నాగ చైతన్య, రానా మధ్య బంధం, బంధుత్వం గురించి అందరికీ తెలిసిందే. బంధుత్వాన్ని మించిన స్నేహం ఇద్దరి మధ్య ఉంది. ఈ కారణంగా త్యాగం చేశాడా లేక కథ తనకు సెట్ అవదు అనుకున్నాడా అనేది తెలియదు కానీ.. తాజాగా తను చేయాల్సిన ఓ సినిమా కథను నాగ చైతన్య వద్దకు పంపించాడు. చైతూకు కథ బాగా నచ్చడంతో ఇమ్మీడియొట్ గా ఓకే చెప్పాడు. తండేల్ తర్వాత చైతన్య ఈ దర్శకుడితోనే సినిమా చేయబోతున్నాడు. కొన్నాళ్లుగా కొత్త సినిమాలేం ఒప్పుకోవడం లేదు రానా. ఆ మధ్య తేజతో రాక్షస కావ్యం, గుణశేఖర్ తో హిరణ్యకశిప చిత్రాలు చేయాలనుకున్నా.. రెండూ ఆగిపోయాయి. అప్పటి నుంచి చిన్న సినిమాలను ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో కిశోర్ అనే ఓ కొత్త దర్శకుడు రానాతో సినిమా చేయాలనుకున్నాడట. కథ కూడా ఓకే అయింది. ఆర్కా మీడియాలో శోభు యార్లగడ్డ నిర్మాత. అయితే ఎందుకో రానాకు ఈ కథ తనకంటే నాగ చైతన్యకు బావుంటుంది అనిపించిందట. దర్శకుడిని అతని వద్దకు పంపించాడు. చైతూకు స్టోరీ బాగా నచ్చడంతో వెంటనే ఎస్ అనేశాట్ట. దీంతో దర్శకుడు చైతన్య ఇమేజ్ కు తగ్గట్టుగా కొన్ని మార్పులు చేస్తున్నాడని చెబుతున్నారు.

విశేషం ఏంటంటే.. రానా ఈ స్టోరీని వదులుకోవడమే కాదు.. ఈచిత్రానికి సహ నిర్మాతగా కూడా ఉండబోతున్నాడు. ఇక చైతన్య కూడా తండేల్ తర్వాత ఫలానా దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు అనే టాక్స్ చాలానే వచ్చాయి. బట్ అవన్నీ పక్కన పెట్టి ముందు ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయబోతున్నాడట. ఈ మూవీ జానర్ ఏంటో కానీ.. ఆ కొత్త దర్శకుడి లక్ బలే ఉంది. సో.. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ త్వరలోనే రాబోతున్నాయి. 

Tags:    

Similar News