Ranbir Alia : రణబీర్‌పై నెటిజన్లు ఫైర్.. ఎందుకంటే..?
Ranbir Alia : రణబీర్.. నీకసలు బుద్ధుందా అంటూ కపూర్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.;
Ranbir Alia :రణబీర్.. నీకసలు బుద్ధుందా అంటూ కపూర్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రణబీర్ కపూర్, అలియా భట్ కలిసి 'బ్రహ్మాస్త్ర' మూవీలో నటించారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. దీనికి సంబంధించి ఇద్దరూ కలిసి ఓ వీడియో పోస్ట్ చేశారు. దాంట్లో బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ గురించి మాట్లాడారు. త్వరలోనే అన్ని రాష్ట్రాలకూ వెళ్లి ప్రమోషన్స్ చేస్తామన్నారు అలియా భట్. అయితే ప్రమోషన్స్ భారీగా ఎందుకు చేయడం లేదని అలియా చెబుతుండగా రణబీర్ మధ్యలో వచ్చి అలియా బేబీ బంప్‌ను చూస్తూ.. 'ఇక్కడ ఒకరు భారీగా పెరుగుతున్నారు అందుకే' అని రణబీర్ అనడంతో అలియా వెంటనే చిన్నబుచ్చుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రణబీర్‌ను తీవ్రంగా దూషిస్తున్నారు. భార్య ప్రెగ్నెంట్‌తో ఉంటే.. నీకు బార్బీ బొమ్మలా కనిపించాలా అంటే మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.